సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'భరత్ అనే నేను' షూటింగ్ చివరిదశలో ఉంది. ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 27న విడుదలకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో మహేష్ బాబు తన 25వ చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించడం ఆ చిత్రం తాలుకా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.
అందులో భాగంగానే ఆ చిత్రంలో మహేష్ బాబు సరసన నటించడానికి హీరోయిన్ ఎంపిక జరిగిపోయింది. ఆ హీరోయిన్ ఎవరంటే బన్నీ డీజే లో నటించిన పూజా హెగ్డే. ఇప్పటికే పలు కమర్షియల్ హిట్స్ తో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్న పూజా హెగ్డేకి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.
ఎందుకంటే ఈ చిత్రం మహేష్ బాబు 25వ చిత్రం కావడంతో ఆయన అభిమానులు సైతం ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మహేష్ బాబు కూడా తన 25వ చిత్రం తన కెరీర్ మొత్తం మీద గుర్తిండిపోయే విధంగా ఉండాలి అని భావిస్తున్నాడట.
ఇక ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి.