సోషల్ మీడియా హద్దులు దాటేసిన ఈ తరుణంలో ముఖ్యంగా సెలబ్రిటీలు ఆయా సామాజిక మాధ్యమాల వేదికగా, కొందరు ఆకతాయిలకు అనవసరంగా టార్గెట్ అవుతున్న సందర్భాలు అనేకం చూశాం. చూస్తూనే ఉన్నాం. 'సోషల్' బాధిత సెలబ్రిటీలను ఖచ్చితంగా వేళ్లతో లెక్కించలేం. చేంతాడంత పెద్ద లిస్టు వాళ్లది. బ్రీఫ్‌గా తీసుకుంటే, ఇలియానా, రకుల్, రష్మికా.. ఇలా కొన్ని పేర్లు మాత్రమే ప్రస్థావించుకోగలం. ఇక తాజాగా ఈ లిస్టులోకి చేరిపోయింది కేరళ కుట్టీ నివేదా థామస్. అరే ఈ పిల్ల చాలా కామ్ కదా.. ఈ పిల్లతో ఎవరు ఆడుకున్నారు అని ఆశ్చర్యపోకండి. మన సోషల్ వీరులకు ఎవ్వరైనా ఒక్కటే.
అయితే, కాస్త గడుసుగా సమాధానం చెబితే, అస్సలు వదిలిపెట్టరు మరి. ఈ మధ్య నివేదా థామస్‌కి ఇలాంటి అనుభవమే ఎదురైందట. మీరంటే నాకిష్టం.. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా.. ప్రేమించుకుందాం రా.. మీరు వర్జినా.? తదితర ప్రశ్నలు సెలబ్రిటీలకు చాలా చాలా కామన్. ఇటువంటి ప్రశ్నలే నివేదాని కూడి విస్తుపోయేలా చేశాయట. అందుకు ఆమె మర్యాదగా మాట్లాడండి. సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఉంది కదా.. అని ఎలా మాట్లాడినా చెల్లిపోతుందనుకోవద్దు.. కొన్ని సార్లు మూడో నేత్రాలు నిద్ర లేస్తాయి జాగ్రత్త.. అంటూ వార్నింగ్ ఇచ్చిందట. మొన్నీ మధ్య రష్మికా మండన్నా కూడా ఇలాగే వార్నింగ్ ఇచ్చింది. కానీ, సోషల్ వీరులు చాలా ధైర్యవంతులు. బలవంతులు.. వారిని ఆడ్డుకోవడం సాధ్యమా.? సెలబ్రిటీల చురకల దారి చురకలదే. ఆకతాయి నెటిజన్స్ దారి నెటిజన్స్‌దే. అయితే, కొంతలో కొంత సెలబ్రిటీల సెల్ఫ్ శాటిస్‌ఫస్త్రక్షన్ అంతే.