బాహుబ‌లి టిక్కెట్ ధ‌ర‌లో తేడా వ‌స్తే తాట తీస్తాం: మ‌ంత్రి త‌ల‌సాని!

మరిన్ని వార్తలు

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన విజువ‌ల్ వండ‌ర్ `బాహుబ‌లి` `ది క‌నుక్లూజ‌న్` ఈనెల 28న భారీ ఎత్తున విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో థియేట‌ర్ల వ‌ద్ద టిక్కెట్ ధ‌ర‌లు పెంచిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్ర‌పీ మంత్రి విష‌యాన్ని సీరియ‌స్ గా తీసు కుని థియేట‌ర్ యాజ‌మాన్యాన్ని, బాహుబ‌లి టీమ్ ను హెచ్చరించారు.

`తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్ర‌పంచానికి తెలిసింది. బాహుబ‌లి చూసిన త‌ర్వాత చరిత్ర ఊహించ‌ని విధంగా ఓ  క్రేజ్ వ‌చ్చింది. క‌మ‌ర్శియ‌ల్ గాను  సినిమా  పెద్ద స‌క్సెస్ అయింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎలక్ష‌న్  టైమ్ లో...అసెంబ్లీలో కూడా క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌న్న దానిపై చ‌ర్చ సాగింది. హిస్టారిక‌ల్ సినిమా కావ‌డంతో బాహుబ‌లికి 5 షోలు అడిగారు. మేము కూడా అంగీక‌రించాం.  బాహుబ‌లి లాంటి సినిమాకు ప్ర‌మోష‌న్ అవ‌స‌రం లేదు కానీ, ఇష్టాను సారంగా టిక్కెట్ ధ‌ర‌లు ఉన్నాయ‌ని టీవీల్లో వార్త‌లు  వ‌స్తున్నాయి. అలాగే థియేట‌ర్ లో స్నాక్స్ ను ప్యాకేజ్ అంటూ 200, 300 దండేట‌ట్లు ప్లాన్ చేసిన‌ట్లు  ప్ర‌చారం సాగుతోంది.

ఈ విష‌యంపై ప్రభుత్వం సీరియ‌స్ గా ఉంది. దీనిపై ఓ స‌మావేశం కూడా ఏర్పాటు చేశాం.  గ‌వ‌ర్న‌మెంట్ ఫిక్స్ చేసిన రేట్ల‌కు టిక్కెట్లు అమ్మాలి లేక‌పోతే త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాం. బాహుబ‌లి టీమ్ ప్ర‌మేయం లేకుండా థియేట‌ర్ల యాజ‌మాన్యం ఇష్టాను సారంగా వ్వ‌వ‌హ‌రిస్తున్నారు. దానికి మాత్రం బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. బెనిఫిట్ షోలు ఎక్క‌డా ఇవ్వ‌లేదు. బాహుబ‌లి సినిమా కోసం అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌ధ్య త‌గ‌ర‌తి కుటుంబాల‌కు టిక్కెట్ అందుబాటులో లేక‌పోతే మీరంతా చాలా స‌మ‌స్య‌లు ఫేస్ చేయాల్సి ఉంటుంద‌ని` హెచ్చ‌రించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS