చిరు.. రజిని.. ఇలా అయ్యిందేంటి?

మరిన్ని వార్తలు

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్.. ఇద్దరూ బిగ్గెస్ట్ స్టార్స్. ఈ ఇద్దరూ ఆగస్ట్ బరిలో బాక్సాఫీసు ముందుకు వస్తున్నారు. చిరు భోళా శంకర్ తో ఆగస్ట్ 11న వస్తుంటే.. రజనీ ఒక రోజుముందే 10న జైలర్ తో వస్తున్నారు. ఐతే ఈ రెండు సినిమాలకి సరైన బజ్ లేదు. అసలు రజనీకాంత్ 'జైలర్' అనే ఒక సినిమా చేస్తున్నారని ఇక్కడ చాలా మందికి తెలీదు. ఈమధ్య కావాలయ్యా పాట హిట్టై తమన్నా మాస్ స్టెప్పు వైరల్ కావడంతో అలాంటి ఒక సినిమా వుందని కొందరికి తెలిసింది తప్పితే ఇది రజనీకాంత్ సినిమాగా ప్రమోట్ కావడం లేదు. పైగా నిర్మాతలు కూడా తెలుగు ప్రమోషన్స్ పై  పెద్దగా దృష్టిపెట్టినట్లుగా లేరు. 


ఇక చిరంజీవి భోళా శంకర్ పరిస్థితి కూడా ఇలానే వుంది. పాటలు క్లిక్ అవ్వలేదు. టీజర్ ట్రైలర్ కూడా సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించలేకపోయాయి. 'జైలర్' కి ఎంతోకొంత క్రేజ్ తీసుకొచ్చిన తమన్నా భోళా  హీరోయిన్. హిట్టు పాటలు, సిగ్నేచర్ స్టెప్స్ ఇవ్వడంలో చిరంజీవికి సెపరేట్ ట్రాక్ రికార్డ్ వుంది. కానీ భోళాలో అలాంటి మ్యాజిక్ జరగలేదు. పైగా చిరంజీవి కూడా భోళాపై పెద్ద ద్రుష్టిపెట్టినట్లు కనిపించలేదు. 


వాల్తేరు వీరయ్య సినిమా చేసినప్పుడు సినిమాని ప్రమోట్ చేయడంలో  చాలా ఆసక్తి చూపించారు. ట్రైలర్ ఈవెంట్ నుంచే మీడియా ఇంటరాక్షన్స్ లో పాల్గొని ప్రచారం చేశారు. ఇప్పుడు భోళాకి అది కనిపించలేదు. ప్రీరిలీజ్ ఈవెంట్, తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చి భోళా నుంచి బయటపడిపోవాలని ఆలోచనలో వున్నట్లు కనిపిస్తుంది తప్పితే ప్రచారంపై ప్రత్యేక శ్రద్దపెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లుగా లేదు. ఏదేమైనా ఇప్పుడు ఇద్దరూ మెగాస్టార్లు నుంచి ఎలాంటి సందడి లేకుండానే రెండు సినిమాలు బాక్సాఫీసు ముందుకు వచ్చే పరిస్థితి నెలకొంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS