బ్రోకి మ‌రో ఛాన్స్‌!

మరిన్ని వార్తలు

గ‌త వారం విడుద‌లైన 'బ్రో' మిక్డ్స్ రివ్యూల్ని అందుకొంది. బాక్సాఫీసు ద‌గ్గ‌ర యావ‌రేజ్ గా వ‌సూళ్లు ద‌క్కుతున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించ‌డానికి ఇంకొన్ని రోజులు కావాలి. అదృష్టం ఏమిటంటే.. ఈ వారం పెద్ద‌గా సినిమాలేం లేవు. ఒక‌ట్రెండు చిన్న సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. వాటి ఎఫెక్ట్ బాక్సాఫీసు ద‌గ్గ‌ర అంతంత మాత్ర‌మే. అంటే... 'బ్రో' కి ఇంకా  ఛాన్స్ ఉంద‌న్న‌మాట‌. ఈ వీకెండ్ కూడా సినిమా చూడాలంటే `బ్రో`కి మించిన ఆప్ష‌న్ మ‌రోటి లేదు.


తొలివారం ఫ్యాన్స్ హంగామా ఉంటుంది. రెండో వారం నుంచి కుటుంబ ప్రేక్ష‌కుల‌కు థియేట‌ర్ల‌కు వ‌స్తారు. అందుకే చిత్ర‌బృందం ప‌బ్లిసిటీ ఎక్క‌డా త‌గ్గించ‌డం లేదు. కొత్త ప్రోమోల్ని వ‌దులుతున్నారు. స‌క్సెస్‌మీట్ ఒక‌టి నిర్వ‌హించి, జ‌నం ఈ సినిమా గురించి మాట్లాడుకొనేలా చేశారు. ఇప్పుడు ఓ టూర్ ప్లాన్ చేశారు. ఫృథ్వీ - అంబ‌టి ఎపిసోడ్ ఇంకా న‌లుగుతూనే ఉంది. ఈ సినిమాకి అది కూడా ఓర‌కంగా ప్ల‌స్సే. వ‌చ్చేవారం `జైల‌ర్‌`, `భోళా శంక‌ర్‌` విడుద‌ల‌కు రెడీ అవుతున్నాయి. ఆ రెండూ వ‌చ్చాయంటే `బ్రో` హ‌డావుడి పూర్తిగా త‌గ్గిపోతుంది. ఏం చేసినా ఈవారంలోనే చేయాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS