చిరంజీవి 151వ సినిమాగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'సైరా' షూటింగ్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తదుపరి గ్రాఫిక్స్ పనుల్లో సైరా టీమ్ మునిగిపోయింది. ఎప్పటికప్పుడే గ్రాఫిక్స్ సంగతులు చరణ్ దగ్గరుండి పరిశీలిస్తున్నాడట. షూటింగ్ అనుకున్న టైంకే కంప్లీట్ అయినా, గ్రాఫిక్స్‌ని ఇన్ టైంలో కంప్లీట్ చేయడం కొన్ని సందర్భాల్లో సెట్ కాదు.
విజువల్ వండర్ అనుకున్న 'రోబో 2.0' విడుదల ఆలస్యానికి ఆ గ్రాఫిక్సే మొదటి కారణంగా నిలిచాయి. అయితే, 'సైరా' విషయంలో అలా జరక్కూడదనీ, చరణ్ ముందు నుంచే పక్కా ప్రణాళికతో ఉన్నాడట. అలా ఓ పక్క ఈ సినిమాకి నిర్మాతగా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు, మరో పక్క తన సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్' షూటింగ్‌నీ రెండూ చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే, విడుదలకు దగ్గరైన 'సైరా'కి ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల నుండి తలనొప్పి రేకెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయమై 'సైరా' టీమ్ ఆల్రెడీ స్పందించింది.
ఇష్యూని పెద్దది చేయకూడదనే ఉద్దేశ్యంతో కామ్‌గా ఉన్నామనీ ప్రకటించింది. ఇక ఈ సినిమాకి నిర్మాత అయిన చరణ్ ఈ విషయమై డైరెక్ట్‌గా స్పందించలేదు. చరణ్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకునే అవసరం లేదనుకుంటున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారమ్. అయితే, అల్లు అరవింద్, మరికొందరు మెగా ఫ్యామిలీ సన్నిహితులు ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నారట. ఏది ఏమైనా 'సైరా' అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా సైరా టీమ్ కష్టపడుతోంది.