తగ్గేదే.. లే అంటూ పుష్ష టీజర్‌లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ తెగ పాపులర్ అయ్యింది. పుష్ష విషయంలో నిర్మాతలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. పుష్ష ని డిసెంబర్ లో విడుదల చేస్తామని చిత్రబృందం ఇది వరకే చెప్పింది. అయితే పుష్ష విడుదల ఆలస్యం అవుతుందని, డిసెంబరులో వచ్చే అవకాశాలు లేవన్న రూమర్లు వినిపించాయి. వాటికి సరైన రీతిలో సమాధానం చెప్పేసింది చిత్రబృందం.
ఈ సినిమాని డిసెంబరు 17న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ, ఓ పోస్టర్ విడుదల చేసింది. దాంతో రూమర్లకు చెక్ పెట్టినట్టైంది. పాన్ ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. చాలా కాలం తర్వా…బన్నీ , సుకుమార్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో పుష్ప పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా.. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేయబోతున్నట్లుగా గతంలోనే ప్రకటించారు మేకర్స్.