తమిళ హీరో కార్తీ తనదైన శైలిలో హీరోగా విలక్షన కథలను ఎంచుకుంటూ సత్తా చాటుతున్నాడు. అటు తమిళంలోనే కాదు, తెలుగులో కూడా కార్తీకి మంచి మార్కెట్ ఉంది. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో కార్తీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. 'ఊపిరి' సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించి అందరి మనసుల్ని అమాంతం కొల్లగొట్టేశాడీ యంగ్ హీరో. ఇదిలా ఉంటే కార్తీ నటిస్తున్న 'దేవ్' చిత్రం ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో కార్తీ బైక్ రైడర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఇలా పూర్తి కాగానే మరో కొత్త సినిమానీ పట్టాలెక్కించేశాడు.
'మా నగరం' అనే విభిన్నమైన స్టోరీని తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. చిత్రమేంటంటే ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పూర్తిగా లేదట. ఇదే ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకిలా అంటే ఇది పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ అట. యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్‌కి హీరోయిన్ క్యారెక్టర్స్‌తో చిక్కులు వచ్చిన సందర్భాలు ఈ మధ్య అనేకం ఉన్నాయి. సీరియస్ మోడ్‌లో సాగుతున్న స్టోరీకి హీరోయిన్ గ్లామర్ బ్రేకులు వేస్తోందనే నేపథ్యంలో సినిమా విడుదలయ్యాక హీరోయిన్ సీన్లు తొలగించిన సందర్భాలు గతంలో చూసేశాం.
కార్తీ నటించిన 'ఖాకీ' సినిమాలోనే రకుల్ నటించిన సీన్లను నిర్ధాక్షిణ్యంగా కత్తిరించాల్సి వచ్చింది. అలా జరక్కుండా ఉండాలనే ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌ని మొదట్లోన ఆపేస్తున్నారనీ ప్రచారం జరుగుతోంది. అయితే కమర్షియల్ మూవీ అంటే గ్లామర్ తప్పనిసరి. అసలే రొమాంటిక్ ఇమేజ్ ఉన్న కార్తీ సినిమాకి ఇలా జరగడం సబబేనా.? ఇకపోతే ఈ సినిమాలో ఏకంగా 70 శాతం వరకూ యాక్షన్ ఎపిసోడ్సే ఉంటాయట. ఒళ్లు గగుర్పొడిచే పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌ని అద్భుతంగా తెరకెక్కించనున్నారట. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.