"జేమ్స్ బాండ్" కొత్త చిత్రం 'బాండ్ 25' ఒచ్చేస్తోంది.

By Madhukishore - August 22, 2019 - 09:30 AM IST

మరిన్ని వార్తలు

హాలీవుడ్ చిత్రాల్లో 'జేమ్స్ బాండ్' సిరీస్ కి ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. దానికి కారణం...అద్భుతమైన పోరాట సన్నివేశాలు, చేసింగ్ సీన్లు మరియు గన్ ఫైట్లు అంతేకాకుండా కొంచం గ్లామర్ కూడా ఈ చిత్రాల్లో ఉంటుంది. ఈ చిత్రాలకు ఒక హాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. మన దేశం నుండి కూడా ఈ చిత్రాలకు మంచి వసూళ్లే దక్కుతాయి. ఈ సిరీస్ లో వచ్చిన ఆఖరి చిత్రం 'స్పెక్టర్' విడుదలయ్యి దాదాపు 4 ఏళ్ళు అయింది..తదుపరి చిత్రం కోసం బాండ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 

దానికి 'బాండ్ 25' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ఏడాది ఆరంభం లో షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 2020 ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. "నో టైం టు డై" అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న 'యం.జి.యం' సంస్థ చిత్ర హీరో "డేనియల్ క్రేగ్" ను చూపిస్తూ వీడియో ఒకటి విడుదల చేసింది. 'ట్రూ డిటెక్టివ్' టివి సిరీస్ ను అందించిన 'క్యారీ ఫుకునుగ' ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS