ప్రముఖ తమిళ నటులైన సూర్య, సత్యరాజ్ లపై తమిళనాడులోని ఊటీ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే, 2009లో కొంతమంది తమిళ నటులు- సూర్య, సత్యరాజ్, శరత్ కుమార్, చరణ్, విజయ్ కుమార్, వివేక్, అరుణ్ విజయ్ లు జర్నలిస్టుల పై విమర్శలు కుప్పించారు. అయితే దీనికి పూర్వం, తమిళ నటులు వ్యభిచారానికి పాల్పడుతున్నట్టు ఒక పత్రిక ప్రచురించి వెంటనే క్షమాపణ కూడా కోరింది.
ఈ సంఘటన జరిగిన తరువాతే, ఆ నటులు జర్నలిస్ట్స్ పై విమర్శలు చేశారు. దీనంతటి పైన సీనియర్ జర్నలిస్ట్ రోజరియో మరియా సుసాయ్ ఊటీలోని కోర్టులో కేసు దాఖలు చేశారు.
ఇక దీనిపై విచారణ చేపట్టిన కోర్టు, ఆ నటినటులను కోర్టుకి హాజరు కావాలని కోరగా, వారు విచారణకి రాలేదు. దీనితో కోర్టు దిక్కరణ క్రింద వీరందరికీ నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.