విజయ్‌ దేవరకొండకు అగ్నిపరీక్ష.!

మరిన్ని వార్తలు

విజయ్ దేవరకొండ నోటా సినిమా న్యూస్:-

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ నటించిన 'నోటా' చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఫైనల్‌ రిజల్ట్‌ ఏంటనేది కాస్సేపట్లో తెలిసిపోతుంది. ఇక ఆల్రెడీ ప్రివ్యూస్‌ రిపోర్ట్స్‌ ద్వారా అందిన సమాచారమ్‌ ప్రకారం సినిమాకి మిక్స్‌డ్‌ టాక్‌ వినిపిస్తోంది. ఎర్లీ రిపోర్ట్స్‌ ఏమంత పోజిటివ్‌గా కనిపించడం లేదు. విజయ్‌ దేవరకొండ నటించిన 'అర్జున్‌రెడ్డి' చిత్రానికీ మొదట ఇదే పరిస్థితి.

 

కానీ తర్వాత దుమ్ము దులిపేసింది. వసూళ్ల పంట పండించేసింది. 'గీత గోవిందం' సినిమాకి మొదట్లోనే హిట్‌ టాక్‌ వచ్చేసింది. దాంతో ఆ సినిమా సాధించిన వసూళ్ల జాతర ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 100 కోట్లు దిశగా ఆగని పరుగులు తీసింది 'గీత గోవిందం'. సో టాక్‌తో సంబంధం లేకుండా విజయ్‌ వసూళ్ల మ్యాజిక్‌ చేస్తూనే ఉన్నాడు. మరి ఈ సినిమాకీ అదే మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తాడా.? చూడాలిక. ప్రతీ సినిమాకీ మార్కెట్‌ని విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాడు.

 

ఇంతవరకూ విజయ్‌ నటించిన సినిమాలు ఒకెత్తు. 'నోటా' మరో ఎత్తు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని విపరీతంగా ప్రభావితం చేసేలా ఉంటుందని ప్రమోషన్స్‌లో చెప్పకనే చెప్పేశాడు విజయ్‌ దేవరకొండ. ప్రతీ రాజకీయ నాయకుడూ తప్పనిసరిగా చూడాల్సిన చిత్రం 'నోటా'గా అభివర్ణించాడు కూడా. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మెహరీన్‌ హీరోయిన్‌గా నటించగా, సత్యరాజ్‌, నాజర్‌ కీలకపాత్రలు పోషించారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS