'నోటా' ట్రైలర్‌ కెవ్వు కేక అంతే!

మరిన్ని వార్తలు

విజయ్‌ దేవరకొండ సినిమా నుంచి ఏం ఆశిస్తామో అవన్నీ 'నోటా' సినిమాలో వున్నాయ్‌ అన్పించేలా 'నోటా' ట్రైలర్‌ని రూపొందించారు. నిన్న 'స్నీక్‌పీక్‌' విడుదల చేయడంతోనే 'నోటా'పై అంచనాలు అమాంతం రెట్టింపయిపోయాయ్‌. ఇప్పుడు ట్రైలర్‌ కూడా వచ్చేసింది, దాంతో సినిమాపై అంచనాలు పదింతలయ్యాయనడం అతిశయోక్తి కాదేమో. 

లిప్‌ కిస్‌ నుంచి, విజయ్‌ దేవరకొండ ట్రేడ్‌ మార్క్‌ యారోగెంట్‌ డైలాగ్స్‌ వరకూ ట్రైలర్‌లో అన్నీ కన్పిస్తున్నాయ్‌. డైలాగ్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సినిమాటోగ్రఫీ అన్నీ సింప్లీ సూపర్బ్‌. కొన్ని సన్నివేశాల్లో డిఫరెంట్‌ టోన్‌ (లైటింగ్‌ ఎఫెక్ట్‌) చాలా ప్రత్యేకంగా అన్పిస్తుంది. రాజకీయ నాయకుడిగా విజయ్‌ దేవరకొండ ఈ 'నోటా'లో కన్పించబోతున్నాడు. విజయ్‌ దేవరకొండ సరసన అందాల భామ మెహ్రీన్‌ కౌర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. 

ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా తెలుగుతోపాటు, తమిళంలో కూడా విడుదల కాబోతోంది. 'అర్జున్‌ రెడ్డి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్నే కాదు, మొత్తంగా భారతీయ సినీ ప్రేక్షకులందర్నీ కట్టి పడేశాడు విజయ్‌ దేవరకొండ. దాంతో విజయ్‌ దేవరకొండ నుంచి ఏ సినిమా వచ్చినా, దాని పట్ల అంతటా క్యూరియాసిటీ పెరిగిపోతోంది. 

'నోటా' ట్రైలర్‌ విడుదలైన కాస్సేపట్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్‌ అందుకుంది. సినిమాలో డైలాగ్స్‌ ఇప్పుడు సినీ వర్గాల్లోనే కాక, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS