ఇటీవల విడుదలైన 'ఆర్ఎక్స్ 100' మూవీలో హీరోయిన్గా నటించిన పాయల్ రాజ్‌పుత్‌కి నటనలోనూ, గ్లామర్లోనూ కూడా మంచి గుర్తింపు దక్కింది. ఈక్వెల్ మార్క్స్ దక్కించుకుంది ఈ రెండు టాలెంట్స్లోనూ ఈ హాట్ బ్యూటీ. అయితే గ్లామర్ పరంగా పాయల్ ఓ ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. తొలి సినిమా అయినా కానీ, ఏమాత్రం భయమూ బెరుకూ లేకుండా విచ్చలవిడిగా అందాలారబోసేసింది. 'ఆర్ఎక్స్ 100' సక్సెస్‌లో అమ్మడి హ్యాండ్ ఎన్ని వంతులో చెప్పడమే కష్టం. అప్పియరెన్స్, పర్ఫామెన్స్ టాప్ లెవల్లో చూపించేసింది. హీరోయిన్‌కి ఉండాల్సిన పర్ఫెక్ట్ ఫిజిక్. ఆ ఫిజిక్‌ని మరింత అందంగా మలచుకునేందుకే ఇదిగో ఇలా వర్కవుట్స్ చేస్తోంది. వర్కవుట్స్ చేస్తూ అలిసిపోయిన తన అందాల్ని ఓ సెల్ఫీలో బంధించే ప్రయత్నం చేస్తోందిలా. పులిచర్మంతో డిజైన్ చేసిన బోటమ్లా ఉంది ఆమె ధరించిన ట్రాక్ ప్యాంట్. స్లీవ్‌లెస్ డిజైనర్ టాప్‌లో అమ్మడి నాభి సౌందర్యం కళ్లు చెదిరేలా ఉంది. ఈ తాజా సెల్ఫీ కుర్రకారును కిల్లింగ్ చేసేస్తోందంతే.!