కొరటాల శివ కథలెప్పుడూ సామాజిక అంశాల చుట్టూ తిరుగుతుంటాయి. ఊరిని దత్తత తీసుకోమని శ్రీమంతుడు చెబితే, ఉత్తమ ముఖ్యమంత్రి ఎలా ఉండాలో భరత్ అనే నేనులో చూపించారు. మిర్చి, జనతా గ్యారేజ్ కూడా సమాజంలోంచి పుట్టిన కథలే. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడు కొరటాల శివ. ఎన్టీఆర్ నటించే 30వ సినిమా ఇది. కొరటాల - ఎన్టీఆర్ కాంబో అనగానే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. పైగా.... ఆర్.ఆర్.ఆర్ తరవాత ఎన్టీఆర్ నటించే సినిమా ఇది. కాబట్టి.. కచ్చితంగా అందరి కళ్లూ ఈ సినిమాపైనే ఉంటాయి.
ఆచార్య డిజాస్టర్ తో ఈ సినిమాని ఎలాగైనా హిట్టు చేయాల్సిన బాధ్యత కొరటాలపై పడింది. పైగా పాన్ ఇండియా స్థాయి ఉన్న కథ కావాలి. అందుకే... ఈస్క్రిప్టుపై కొరటాల గట్టిగా ఫోకస్ పెట్టినట్టు టాక్. పాన్ ఇండియా వ్యాప్తంగా అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్టు ఎంచుకొన్నాడట. అదే మెడికల్ మాఫియా. కార్పొరేట్ ఆసుపత్రిలో జరిగే ఆగడాలు ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నాడట. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా కొరటాల ఈ కథని అల్లాడని, అందుకే అందరికీ కనెక్ట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. నిజానికి.. ఎన్టీఆర్‌కి కొరటాల ఇది వరకు వినిపించిన కథ ఇది కాదు. ఆచార్య ఫ్లాప్ తో... కొరటాల కథపై మళ్లీ రీ వర్క్ చేసి.. ఈసారి మెడికల్ మాఫియా చుట్టూ కథ అల్లాడని సమాచారం.