`అల వైకుంఠపురములో` తరవాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఫిక్సయ్యాడు త్రివిక్రమ్. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు పనులు అన్నీ పూర్తయ్యాయి. ఎన్టీఆర్ ఎప్పుడు వస్తే, అప్పుడు ఈ సినిమాని పట్టాలెక్కిద్దామన్న లక్ష్యంతో ఉన్నాడు త్రివిక్రమ్. అయితే `ఆర్.ఆర్.ఆర్` సినిమాలో ఇరుక్కుపోవడం వల్ల ఎన్టీఆర్ ఇప్పట్లో త్రివిక్రమ్ కి అందుబాటులోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. అందుకే ఈలోగా మరో సినిమా చేసుకుందామని త్రివిక్రమ్ భావిస్తున్నాడు.
అయితే అదంత ఈజీ కాదు. త్రివిక్రమ్ - మహేష్ మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని, మహేష్ తో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తాడని జోరుగా ప్రచారం సాగుతోంది. `ఆర్.ఆర్.ఆర్` పూర్తి చేసుకుని ఎన్టీఆర్ అందుబాటులోకి వచ్చేలోగా త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తాడని అనుకుంటున్నారు. కాకపోతే... మహేష్ తో సినిమా చేయడం త్రివిక్రమ్‌కి అంత ఈజీ కాదు. ఎందుకంటే... మహేష్ ఆల్రెడీ పరశురామ్‌కి ఫిక్సయ్యాడు. త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతోంది. ఈలోగా.. త్రివిక్రమ్ సినిమాని ఓకే చేస్తే, అది పరశురామ్ కి అన్యాయం చేసినట్టే. మరోవైపు ఎన్టీఆర్ సైతం... `కాస్త ఆగండి... తొందరపడొద్దు` అని త్రివిక్రమ్ కి నచ్చజెబుతున్నాడట.
ఒకవేళ మహేష్ ప్రాజెక్టుని త్రివిక్రమ్ మొదలెడితే, అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. ఈలోగా ఎన్టీఆర్ `ఆర్.ఆర్.ఆర్` నుంచి ఫ్రీ అయిపోతే.. అప్పుడు ఎన్టీఆర్ ఖాళీగా ఉండాల్సివస్తుంది. అందుకే మధ్యే మార్గంగా ఈ గ్యాప్ లో చిన్న సినిమా తీసుకోమని ఎన్టీఆర్ సలహా ఇస్తున్నాడట. చిన్న సినిమా అయితే తొందరగా పూర్తయిపోతుందన్నది ఎన్టీఆర్ ఆలోచన. మరి త్రివిక్రమ్ ప్లానింగ్ ఎలా ఉందో?