ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా ఖాయమైపోయింది. పార్ట్ 1 `కథానాయకుడు`లో ఎన్టీఆర్ సినీ జీవితం చూడొచ్చు. పార్ట్ 2 `జన నాయకుడు`లో ఎన్టీఆర్ రాజకీయ జీవితం చూడొచ్చు. ఈ రెండు భాగాలూ కేవలం పది హేను రోజుల వ్యవధిలో విడుదల అవుతాయి. ఓ విధంగా నందమూరి అభిమానులకు ఇది పండగలాంటి వార్త.
ఎన్టీఆర్ జీవితం పరిధి చాలా ఎక్కువ. దాన్ని ఒక భాగంలో చెప్పడం కష్టం. అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. అన్నింటికంటే ముఖ్యంగా... ఇది మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా. రెండు భాగాలుగా చేసి రెండు సినిమాలుగా అమ్మడం.. డబుల్ బొనాంజానే కదా..? `ఎన్టీఆర్` బయోపిక్ తొలి భాగం ఇప్పటికే 80 కోట్లకు అమ్ముడుపోయిందని టాక్. రెండో భాగానికీ రూ.80 కోట్లు వచ్చాయనుకుంటే.. ఎన్టీఆర్ సినిమా మార్కెట్ రూ.160 కోట్లన్నమాట. దానికి తోడు రెండు శాటిలైట్ రైట్స్ వస్తాయి. డిజిటల్ రూపంలోనూ డబ్బులొస్తాయి.
సో.. ఓ విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ కథని విస్క్కృతంగా చెప్పాలన్న ఆలోచన కంటే... రెండు రూపాల్లో డబ్బులు చేసుకోవచ్చన్న ప్లాన్ కూడా పార్ట్ 2కి ఓ కారణం కావొచ్చు. మొత్తానికి తెలుగు సినిమాకి సంబంధించినంత వరకూ ఇదో సరికొత్త అధ్యాయం.
ఓ బయోపిక్‌ని రెండు భాగాలుగా తీసుకురావడం ఇదే ప్రధమం కూడా.