'అరవింద సమేత వీర రాఘవ' కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో, అల్లు అర్జున్ కూడా అలానే ఎదురుచూస్తున్నాడు. కారణం... తన తదుపరి సినిమా ఏమిటన్నది 'అరవింద సమేత' రిజల్ట్ పై ఆధారపడి ఉంది.
`నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా` ఫ్లాప్ తరవాత బన్నీ మరీ ఆత్మ రక్షణలో పడిపోయాడు. చాలా కథలు విన్నా, దేనికీ ఓకే చెప్పలేదు. ఎట్టకేలకు త్రివిక్రమ్‌తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. త్రివిక్రమ్ సినిమా కదా, అని కథ చెప్పగానే `ఎస్` అనేయలేదు బన్నీ. తన దృష్టంతా ఇప్పుడు `అరవింద సమేత` రిజల్ట్‌పై ఉంది.
ఈ సినిమా హిట్టయితే, మరో ఆలోచన లేకుండా త్రివిక్రమ్‌తో ప్రొసీడ్ అయిపోవడానికి బన్నీ ఎదురుచూస్తున్నాడు. కనీసం యావరేజ్‌గా ఆడినా.. త్రివిక్రమ్‌తో జట్టు కడతాడు బన్నీ. అటూ ఇటూ అయితే మాత్రం.. తన దగ్గరున్న మిగిలిన ఆప్షన్లకు `టిక్` పెడతాడు. విక్రమ్ కె.కుమార్‌తో కథ ఓకే అయ్యిన విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ కేవలం `అరవింద సమేత` కోసమే ఆలస్యం అవుతోంది.
`అరవింద సమేత` హిట్టయితే విక్రమ్ సినిమాని సైతం పక్కన పెట్టి త్రివిక్రమ్‌తో ప్రొసీడ్ అవ్వాలన్నది బన్నీ ప్లాన్. ఎందుకంటే టాలీవుడ్ లో ప్రతిభ కంటే గెలుపు గుర్రాలకే విలువ ఎక్కువ. `హలో` ఫ్లాప్ విక్రమ్ కుమార్‌పైనా ఎఫెక్ట్ చూపించింది. అందుకే బన్నీ తన దృష్టి పై ఫోకస్ చేశాడు.