ప్రస్తుతం టాలీవుడ్‌లో 'ఎన్టీఆర్' టైటిల్‌తో స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత గాధ, 'యాత్ర' టైటిల్‌తో దివంగత నేత వైఎస్సార్ జీవిత గాధలు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు బయోపిక్స్‌నీ ఓ పెద్ద సమస్య వెంటాడుతోందిప్పుడూ.
'ఎన్టీఆర్' బయోపిక్ విషయానికి వస్తే, ఎన్టీఆర్ జీవితంలో 'వెన్నుపోటు' ఎపిసోడ్ అత్యంత కీలకమైనది. ఆ ఎపిసోడ్ విషయమై డిఫరెన్సెస్ రావడంతోనే తేజ ఈ సినిమా దర్శకత్వం నుండి తప్పుకోవాల్సి వచ్చిందట. అయితే ఇప్పుడు క్రిష్ చేతిలో ఉన్న ఈ ప్రాజెక్టులో ఆ ఎపిసోడ్‌ని క్రిష్ ఎలా డీల్ చేస్తాడోనని అంతా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇకపోతే వైఎస్సార్ జీవిత చరిత్ర విషయానికి వస్తే, ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన మరణానంతరం ఇప్పుడు జగన్ కాంగ్రెస్ నుండి సెపరేట్ అయిపోయి కొత్త పార్టీ 'వైఎస్సార్‌సీపీ' పార్టీని స్థాపించాడు. మరి ఈ బయోపిక్‌ని కాంగ్రెస్‌కి సపోర్ట్‌గా తెరకెక్కిస్తారా? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. అలాగే వైఎస్సార్ మరణం ప్రమాదవశాత్తూ జరిగింది కాదనీ, ఆయన మరణం వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందనీ జగన్, విజయమ్మ ఆరోపించిన సంగతి కూడా తెలిసిందే.
ఇలా అతిపెద్ద సమస్యలైన వీటిని అధిగమించి ఈ రెండు బయోపిక్స్‌నీ దర్శకులు ఎలా డీల్ చేస్తారో చూడాలి మరి.