ఎన్టీఆర్‌ అభిమానులు ‘దమ్ము’ చూపిస్తున్నారోచ్‌!

మరిన్ని వార్తలు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో గత కొద్ది రోజులుగా చాలా యాక్టివ్‌ అయ్యారు. ఈ నెల 20న తమ అభిమాన హీరో పుట్టినరోజు నేపథ్యంలో నెల రోజుల ముందు నుంచే హడావిడి షురూ చేశారు. ఇక, ఇప్పుడు తమ జోరు మరింత పెంచేశారు యంగ్‌ టైగర్‌ అభిమానులు. రానున్న రోజుల్లో ఈ ట్రెండింగ్‌ అనేది నెక్స్‌ట్‌ లెవల్‌లో వుండబోతోందట. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బర్త్‌డేకి సంబంధించి ‘కామన్‌ డిపి’ విడుదల కావడంతో, అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది.

 

మరోపక్క, యంగ్‌ టైగర్‌ అభిమానులు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా నుంచి అద్భుతమైన గిఫ్ట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, కరోనా వైరస్‌ నేపథ్యంలో సాంకేతిక సమస్యలతో ఆ గిఫ్ట్‌ సమయానికి వస్తుందా.? లేదా.? అన్నదానిపై కొంత ఆందోళన వుంది. దర్శకుడు రాజమౌళి అయితే, గ్యారంటీ ఇవ్వడంలేదు. కాగా, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నుంచి ఈ నెల 19 సాయంత్రం రెండు ఆసక్తికరమైన ప్రకటనలు రాబోతున్నాయట. అందులో ఒకటి త్రివిక్రమ్ తో సినిమా గురించీ, ఇంకోటి మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్న సినిమా గురించీ. ఇది ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వుండబోతోందన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. మరి, ఎన్టీఆర్‌ అభిమానుల్ని ఆ రెండు గిఫ్ట్‌లు ఏ స్థాయిలో అలరిస్తాయి.? అన్నిటికీ మించి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సంగతేంటి? వేచి చూడాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS