వినాయక్ అత్యంత సన్నిహితులుగా భావించే వారిలో చిరంజీవి ఒకరు. ఆయన తర్వాత వినాయక్ అంతటి ప్రత్యేకతను ఎన్టీఆర్‌కే ఇస్తాడు. దాదాపు చిరంజీవితో ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఎన్టీఆర్‌కి ఇస్తాడు వినాయక్. ఈ ఇద్దరూ తన జీవితంలో ఎంతో స్పెషల్ అని చాలా సార్లు చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌తో వినాయక్ 'ఆది', 'సాంబ', 'అదుర్స్' సినిమాలు తెరకెక్కించాడు. ఈ మూడు సినిమాలూ ఇటు ఎన్టీఆర్‌కీ, అటు వినాయక్‌కీ కూడా కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్స్‌గా నిలిచాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు వినాయక్ హీరోగా మారాడు.
సినిమాపై అంచనాల సంగతి ఏంటీ.? అని మాట్లాడుకునే కన్నా, తాను హీరోగా తెరకెక్కుతోన్న సినిమా కోసం ఏం చేయబోతున్నాడు.? అనేదే ప్రస్తుతం రైజ్ అవుతోన్న క్వశ్చన్. తనకు అత్యంత సన్నిహితుడైన ఎన్టీఆర్‌ని తన సినిమాలో గెస్ట్‌గా తీసుకురాబోతున్నాడట. అయితే, ఆ పాత్ర ఎలా ఉండబోతుంది.? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే, ఎన్టీఆర్ అప్పియరెన్స్ చాలా చాలా స్పెషల్‌గా ఉండబోతోందట.
వినాయక్ హీరోగా తెరకెక్కుతోన్న 'శీనయ్య' చిత్రం పూజా కార్యక్రమాలతో ఈ రోజే లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ కార్యక్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నరసింహ ఈ సినిమాకి దర్శకుడు కాగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్నారు.