పోలీస్ యూనిఫామ్‌లో శ్రీ‌విష్ణు.

By Gowthami - October 08, 2019 - 14:30 PM IST

మరిన్ని వార్తలు

బ్రోచేవారెవ‌రురా...తో ఓహిట్టు కొట్టాడు శ్రీ‌విష్ణు. ఆ సినిమా త‌ర‌వాత కొత్త సినిమా ఏదీ ప‌ట్టాలెక్కించ‌లేదు. ఇప్పుడు ఓ క‌థ‌కు ప‌చ్చ‌జెండా ఊపాడు. ఈ చిత్రానికి ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. విజ‌య ద‌శ‌మి సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. న‌వంబ‌రులో సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ చిత్రంలో శ్రీ‌విష్ణు పోలీస్ అధికారిగా క‌నిపించ‌నున్నాడు.

 

శ్రీ‌విష్ణు పోలీస్ పాత్ర పోషించ‌డం ఇదే తొలిసారి. శ్రీ‌విష్ఱు ఎప్పుడూ భిన్న‌మైన క‌థ‌ల‌నే ఎంచుకుంటాడు. ఈ సినిమా కూడా.. కొత్త త‌ర‌హాలోనే సాగుతుంద‌ని, శ్రీ‌విష్ణు పాత్ర‌లో బోలెడ‌న్ని ట్విస్టులు ఉంటాయ‌ని తెలుస్తోంది. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించ‌నున్న ఈ చిత్రానికి స‌త్తిబాబు నిర్మాత‌. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని ప్ర‌క‌టిస్తారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS