సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు లొకేషన్స్ నుండి స్టిల్స్, వీడియోస్ లీక్ అయిపోవడం, ఈ మధ్య సర్వ సాధారణం అయిపోయింది. అయితే స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఈ పని చాలా సులువైపోయింది. ఈ కారణంగా కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తున్న దర్శక, నిర్మాతలకు ఈ లీకుల వ్యవహారం చాలా తలనొప్పిగా మారి ఇబ్బంది కలిగిస్తోంది. గెటప్ దగ్గర నుండి, రకరకాల విషయాలను సస్పెన్స్‌గా ఉంచాలనుకుంటుంది చిత్ర యూనిట్. కానీ స్మార్ట్ టెక్నాలజీ పెరిగిపోయాక, లీకు వ్యవహారం ఎంత తేలికైపోయిందంటే విత్ ఇన్ సెకన్స్‌లో ప్రపంచం చుట్టేస్తోంది. ఉదాహరణకి ఒక సాంగ్ షూటింగ్ తీసుకుంటే వన్స్ లీకైందా, సాంగ్ సాంగ్ మొత్తం వెంటనే సోషల్ మీడియాకి ఎక్కేస్తోంది. అయితే 'సాహో' సినిమా నుండి ఈ రకమైన లీకేజ్‌లే లేకుండా పకడ్బంధీగా ఏర్పాట్లు చేస్తున్నారట. చాలా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందులో భాగంగా, షూటింగ్ స్పాట్‌లోకి మొబైల్ ఫోన్స్, ఇతరత్రా ఎలక్ట్రానిక్ గాడ్జిట్స్‌ని అనుమతించడం లేదట. తమిళంలో డైరెక్టర్ శంకర్, తెలుగులో రాజమౌళి ఇంత పకడ్బంధీ ఏర్పాట్లు చేస్తుంటారు తమ తమ సినిమా షూటింగ్స్ టైమ్‌లో. అయితే అదే పద్ధతిని ఇప్పుడు 'సాహో' టీమ్ కూడా పాఠిస్తోంది. అయితే ఎంత జాగ్త్రతలు తీసుకున్నా కానీ లీకుల్ని నిర్మూలించడం అతి కష్టమైన పనే. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో చాలా వరకూ ఈ లీకుల మహమ్మారి బారిన పడి ఇబ్బందుల పాలయ్యాయి. ఎంత ముందు జాగ్రత్తలు తీసుకున్నా కానీ లీకేజీని అరికట్టడం అంత తేలికైన విషయం కాదు మరి. అయితే 'సాహో' యూనిట్ అతి జాగ్రత్త ఎంతవరకూ పని చేస్తుందో చూడాలి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఇది. ప్రబాస్ - శ్రద్ధాకపూర్ జంటగా తెరకెక్కుతోంది.