బాక్సాఫీస్ దగ్గర దేవర దండయాత్ర మాములుగా లేదు. రికార్డ్ ల మీద రికార్డ్స్ సాధిస్తోంది. RRR తరువాత ఎన్టీఆర్ సోలోగా పాన్ ఇండియా హిట్ కొట్టారు. జాన్వీకి తెలుగులో గ్రాండ్ ఎంట్రీ దొరికింది. మొదటి సినిమానే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. కొరటాల శివతో ఎన్టీఆర్ కి ఇది రెండో సినిమా. మొదట వీరి కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు ఈ మూవీ కూడా ఎన్టీఆర్ కి పాన్ వరల్డ్ లో గుర్తింపు తెచ్చింది. దేవర మూడు రోజుల్లోనే 304 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. దసరా సెలవుల నేపథ్యంలో ఇంకా ఈ వసూళ్లు పెరిగే చాన్స్ ఉంది.
దేవర రిలీజ్ అయ్యి 5 రోజులయ్యింది. ఈ నేపథ్యంలో దేవర వసూళ్ల గూర్చి మేకర్స్ అనౌన్స్ చేసారు. దేవర ఐదో రోజు కలక్షన్స్ చూస్తే నైజాంలో 2.37 కోట్లు , సీడెడ్ 1.22 కోట్లు , వైజాగ్ 0.58, ఈస్ట్ 0.29, వెస్ట్ 0.24, కృష్ణ 0.30, గుంటూరు 0.29, నెల్లూరు 0.26, వసూళ్లతో ఐదో రోజు మొత్తంగా 5.55 వసూలు చేసింది దేవర.
మొత్తంగా ఐదు రోజులకి కలిపి రెండు తెలుగురాష్ట్రాల వసూళ్లను చూస్తే నైజాం 37.75 కోట్లు, సీడెడ్ 20.63 కోట్లు, వైజాగ్ 10.21 కోట్లు, ఈస్ట్ 6.46 కోట్లు, వెస్ట్ 5.15 కోట్లు, కృష్ణ 5.79 కోట్లు, గుంటూరు 8.73 కోట్లు, నెల్లూరు 3.92 కోట్లు, వసూళ్లు చేశాయి. టోటల్ 5 డేస్ కలెక్షన్స్ లో రెండు తెలుగు రాష్ట్రాలకి 98.64 తో వంద కోట్ల దగ్గర గ్రాస్ కలక్షన్స్ వచ్చాయి. అన్నిటికంటే నైజాంలో దేవర గ్రాస్ ఎక్కువ ఉంది. దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు అవటంతో ఇప్పుడు సక్సెస్ మీట్ పెట్టె ఆలోచనలో ఉన్నారట మేకర్స్. శ్రేయాస్ మీడియా సక్సెస్ మీట్ నిర్వహణకు భారీ ఏర్పాట్లు మొదలు పెట్టింది.