ఇటీవల అమెరికాలో జరిగిన హెచ్‌సీఏ అవార్డు ఫంక్షన్‌లో ఆర్.ఆర్.ఆర్. తన సత్తా చాటింది. ఏకంగా 5 అవార్డులు అందుకొంది. అవార్డు వేదికపై చరణ్ - రాజమౌళి హంగామా చేశారు. ఆ ఫంక్షన్‌కి కీరవాణి, సింథిల్ కూడా హాజరయ్యారు. కానీ ఎన్టీఆర్ కనిపించలేదు. దాంతో.. తారక్ ఫ్యాన్స్ బాగా హర్టయ్యారు.
ఆర్.ఆర్.ఆర్ అంటే..చరణ్ ఒక్కడే కాదని, ఎన్టీఆర్ కూడా అని, అలాంటప్పుడు ఎన్టీఆన్‌ని ఎందుకు పిలవలేదంటూ... సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై.. హెచ్‌సీఏ స్పందించింది. తాము ఎన్టీఆర్‌ని పిలిచామని, అయితే.. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాలేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు హెచ్‌సీఏ ఓ ట్వీట్ చేసింది. ``మేం ఎన్టీఆర్‌ని ఆహ్వానించాం. ఆయన షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల రాలేదు. దానికితోడు ఆయన సోదరుడు ఇటీవలే మరణించారు. అందుకే ఆయన ఈకార్యక్రమానికి రాలేకపోయారు. మేం ఆయనకు త్వరలోనే అవార్డు పంపుతాం`` అంటూ వివరణ ఇచ్చింది.
దాంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త తగ్గారు. తారకరత్న ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే తారక్ షూటింగ్ కూడా రద్దు చేసుకొన్నారు. ఇలాంటి సమయంలో ఆయన అమెరికా వెళ్లి, అవార్డు ఫంక్షన్‌లో కనిపించడం బాగోదు. అందుకే.. తారక్ అమెరికా వెళ్లలేదు.