'స్టూడెంట్ నెంబర్ వన్', 'ఆది', 'సింహాద్రి' సినిమాలతో ఇండస్ట్రీ భారీ హిట్స్‌ని సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మూడు సినిమాల వరుస విజయాలతో ఏకంగా నెంబర్ వన్ ఛైర్ మీదే కన్నేశాడు ఎన్టీఆర్. మొత్తం మాస్ ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు తిప్పేసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోవడానికి చాలా టైం పట్టింది ఎన్టీఆర్‌కి. మధ్యలో 'యమదొంగ' వంటి మాస్ సినిమా వచ్చినప్పటికీ 'సింహాద్రి' స్థాయి విజయాన్ని అయితే అందుకోలేకపోయాడు. దాంతో ఎన్టీఆర్ కొంచెం స్లో అయ్యాడు. ఎన్టీఆర్ నుంచి భారీ ఇండస్ట్రియల్ హిట్‌ని ఎక్స్‌పెక్ట్ చేశారు ఆడియన్స్, ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నా కానీ 'టెంపర్' సినిమాతో వచ్చి, విశ్వరూపాన్ని చూపించాడు. పూరీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్‌లోని నటున్ని డిఫరెంట్ యాంగిల్‌లో చూపించింది. దీంతో మళ్లీ ఎన్టీఆర్ ట్రాక్ ఎక్కేశాడు. ఎన్టీఆర్ అంటే డాన్సులు, ఎన్టీఆర్ అంటే పర్‌ఫామెన్స్. ఆ స్థాయి పర్‌ఫామెన్స్, డాన్సులు మళ్లీ 'టెంపర్' సినిమాతో రిపీట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో ఆగలేదు ఎన్టీఆర్. దూకుడు ప్రదర్శించాడు. అంత వరకూ ఉన్న ఫెయిల్యూర్స్ అన్నీ ఈ సినిమాతో కొట్టుకుపోయాయి. ఎన్టీఆర్ తన స్టామినాకి తగ్గ సినిమా మళ్లీ ఈ సినిమాతో ప్రేక్షకులకందించాడు.
తర్వాత వచ్చిన సినిమా లెక్కల మాస్టారు సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చింది. అదే 'నాన్నకు ప్రేమతో'. సుకుమార్ వేసిన సక్సెస్ లెక్కల్ని ఈ సినిమా చాలా చక్కగా అందిపుచ్చుకుంది. 100కి 100 మార్కులు వేయించేసుకుంది ఈ సినిమా. ఇంతవరకూ అమ్మ ప్రేమ గురించి చాలా సినిమాలు వచ్చాయి. కొత్తగా నాన్న ప్రేమను చాటి చెప్పేలా ఈ సినిమా సబ్జెక్ట్ ఉండడంతో జనానికి కొత్తగా కనెక్ట్ అయ్యింది. అదీ కాక సుకుమార్ తనదైన స్టైల్‌లో ఎన్టీఆర్‌ని స్టైలిష్‌గా మార్చేశాడు. ఆ లుక్ కూడా జనానికి బాగా రీచ్ అయ్యింది. ఈ సినిమాతో మరో హిట్‌ని సొంతం చేసుకుని హ్యాట్రిక్ మీద కన్నేశాడు ఎన్టీఆర్. జనం ఊహించిన విధంగానే స్టైలిష్ పర్‌ఫామెన్స్, స్టైలిష్ డాన్సులతో జనానికి అదిరిపోయే హిట్ ఇచ్చి మళ్లీ నెంబర్ వన్ స్థానానికి చెక్ పెట్టేశాడు. 2016 స్టార్టింగ్‌లో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్‌కి భారీ సక్సెస్‌ని అందించింది. ఇక ఏడాది ద్వితీయార్ధంలో వచ్చింది 'జనతా గ్యారేజ్'. కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాతో మంచి మెసేజ్‌ని అందించాడు సొసైటీకి ఎన్టీఆర్. ప్రకృతిని కాపాడుకుందాం అంటూ క్లాస్ లుక్‌తో వచ్చినా, మాస్ డైలాగులతో ఆకట్టుకున్నాడు. అందుకే 2016 యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి బాగా కలిసొచ్చింది. ఎంతలా? అంటే, ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న రెండు బిగ్ సక్సెస్‌లు ఈ ఏడాది ఎన్టీయార్‌కి లభించేంతలా. మొత్తానికి సక్సెస్‌ల హ్యాట్రిక్‌ని 2016లో ఇలా పూర్తి చేశాడు ఎన్టీయార్. ఈ రెండు సినిమాలు ఎన్టీఆర్ స్టామినాని చాటి చెప్పిన సినిమాలుగా చెప్పుకోవచ్చు.
2015లో 'టెంపర్' సినిమాలో చాలా రఫ్‌గా కన్పిస్తాడు ఎన్టీయార్. అయితే 'నాన్నకు ప్రేమతో' సినిమా కోసం ఎన్టీయార్ చాలా మారాడు. సెటిల్డ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. అంతకు మించిన మెచ్యూరిటీ గల క్యారెక్టర్ యంగ్‌టైగర్‌కి 'జనతా గ్యారేజ్' రూపంలో దక్కింది. ఓవర్సీస్ మార్కెట్‌లో 'నాన్నకు ప్రేమతో' ఎన్టీయార్‌కి అద్భుత విజయాన్ని అందిస్తే, కేరళ మార్కెట్‌ని 'జనతా గ్యారేజ్' సినిమా ఎన్టీయార్‌కి పువ్వుల్లో పెట్టి ఇచ్చిందని చెప్పకతప్పదు. హ్యాట్రిక్ హిట్స్‌తో సెటిలైపోయిన ఎన్టీఆర్ తదుపరి సినిమాల్లో తన పర్‌ఫామెన్స్ అంతకుమించి అన్నట్లుగా ఉండాలనుకున్నాడు. అందుకే 'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత కొంచెం ఎక్కువే గ్యాప్ తీసుకున్నాడు. గ్యాప్ తీసుకున్నా అదిరిపోయే స్టోరీని ఎంచుకున్నాడు. బాబీ దర్శకత్వంలో సినిమాకి ఓకే చేశాడు. ఈ సినిమాతో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించాలనుకుంటున్నాడు. తాను అందుకున్న నెంబర్ వన్ స్థాయికి మించకుండా ఉండేలా తన పర్‌ఫామెన్స్ ఉండబోతోందట ఈ సినిమాలో. ఆ తర్వాత త్రివిమ్ర్‌తో మరో ఎంటర్‌టైనింగ్ స్టోరీని కూడా ఓకే చేశాడు ఎన్టీఆర్. ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. టోటల్‌గా 2016లో రెండు భారీ హిట్స్ ఎన్టీఆర్ సొంతం అయ్యాయి. అలాగే 2017లో కూడా రెండు భారీ హిట్లకు ఖాతా ఓపెన్ చేసి రెడీగా ఉన్నాడు ఎన్టీఆర్.