ఎన్టీఆర్‌ని ఏం చేస్తున్నావ్‌ రాజమౌళీ!

మరిన్ని వార్తలు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కోసం దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ని పెట్టించాడు. అదీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా కోసమే. కానీ యంగ్‌ టైగర్‌ మాత్రం బాగా లావెక్కిపోయాడు. దీనికి సంబంధించి ఓ ఫొటో తాజాగా లీక్‌ అయ్యింది. 'రాఖీ' సినిమా టైమ్‌లో యంగ్‌ టైగర్‌ ఎంత బొద్దుగా వున్నాడో, అంతకు మించి కనిపిస్తున్నాడు తాజాగా లీక్‌ అయిన ఫొటోల్లో. అది చూసి అందరూ షాకవుతున్నారు. రాజమౌళీ, మా ఎన్టీఆర్‌ని ఏం చేస్తున్నావ్‌? అని వారంతా ప్రశ్నిస్తున్నారు సోషల్‌ మీడియాలో.

 

కానీ, అసలు విషయం వేరేలా వుంది. ఫిట్‌నెస్‌ పట్ల శ్రద్ధ చూపాలంటే, ఆరోగ్యంగా వుండాలి. కాస్త ఒళ్ళు చేసి గట్టిగా కసరత్తులు చేస్తే, రిజల్ట్‌ చాలా బావుంటుందట. అదే సూత్రాన్ని యంగ్‌ టైగర్‌ విషయంలో ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ అప్లయ్‌ చేస్తున్నాడని సమాచారమ్‌. అయితే 'అరవింద సమేత'కు ఇలా ఎందుకు జరగలేదని అభిమానులు ప్రశ్నించడం సబబే. ఎన్టీఆర్‌ సంగతి ఇలా ఉంటే, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా 'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం కసరత్తులు చేయాల్సి వుంది.

 

అయితే సంక్రాంతి తర్వాతే రామ్‌చరణ్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో మళ్ళీ జాయిన్‌ అవుతాడని సమాచారమ్‌. ఈలోగా తన కొత్త సినిమా 'వినయ విధేయ రామ' ప్రమోషన్స్‌ కోసం చరణ్‌ టైమ్‌ కేటాయించాల్సి వుంటుంది. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత భారీ మల్టీస్టారర్‌గా 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డులకెక్కింది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS