బాల‌య్య సినిమాలో ఎన్టీఆర్‌

మరిన్ని వార్తలు

ఎప్పుడో ప‌ద్దెనిమిదేళ్ల క్రితం ఆగిపోయిన `న‌ర్త‌న శాల‌` సినిమాలోని రెండు బిట్ల‌ని.. రేపు అంటే శ‌నివారం విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా శ్రీ‌యాస్ ఓటీటీలో విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 17 నిమిషాల గ‌ల 2 స‌న్నివేశాల్ని `న‌ర్త‌న శాల‌`లో చూడొచ్చు. అయితే అందుకోసం టికెట్ కొనాల్సి ఉంటుంది. టికెట్ వెల 50 రూపాయ‌లు. ప‌న్నుల‌తో క‌లిపి 60 వ‌ర‌కూ అవుతుంది.

 

అయితే ఈ `న‌ర్త‌న‌శాల‌`లో పెద ఎన్టీఆర్.. అన్న నంద‌మూరి తార‌క‌రామారావు కూడా క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. చివ‌ర్లో ఆయ‌న పై నుంచి పూల వ‌ర్షం కురిపించ‌డం క‌నిపిస్తుంద‌ని టాక్‌. అల‌నాటి `న‌ర్త‌న‌శాల‌`లోని కొన్ని షాట్లు కూడా క‌నిపించే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. అంతేకాదు.. `టాప్ హీరో`లో సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న అనేపాట‌ని కూడా `న‌ర్త‌న శాల‌`లో వాడుకున్నార్ట‌. అయితే ఆ పాట‌కీ `న‌ర్త‌న‌శాల‌` సినిమాకీ ఉన్న సంబంధం ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని గంట‌లు ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS