రాధే శ్యామ్... విషాదంతమా?

మరిన్ని వార్తలు

ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో పాన్ ఇండియా చిత్రం `రాధే శ్యామ్‌`. పూజా హెగ్డే క‌థానాయిక‌. రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తోంది. ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ రోజు మోష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. మోష‌న్ పోస్ట‌ర్ చూస్తుంటే ఇదేమైనా విషాదంత‌మైన ప్రేమ‌క‌థా? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

 

మోష‌న్ పోస్ట‌ర్ లో రోమియో - జూలియ‌ట్‌, స‌లీమ్ - అనార్క‌లీ, దేవదాస్‌- పార్వ‌తీ ప్ర‌తిరూపాలు క‌నిపించాయి. ఆ త‌ర‌వాతే... రాధ, శ్యామ్ ల‌ను రివీల్ చేశారు. ఆ ముగ్గురివీ.. విషాదంత‌మైన ప్రేమ‌క‌థలే. మ‌రి. రాధ - శ్యామ్‌ల‌దీ అంతేనా? అనే డౌట్లు వ‌స్తున్నాయి. ఇదో స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ ని చిత్ర‌బృందం ముందు నుంచీ చెబుతూనే ఉంది. మ‌రి దాన్ని విషాదాంతం చేస్తారా? సుఖాంతం చేస్తారా? అన్న‌ది చూడాలి. జాత‌కాల నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. మోష‌న్ పోస్ట‌ర్లోనూ ఆ సంకేతాలు క‌నిపిస్తున్నాయి. అయితే... ఈ సినిమాలో యాక్ష‌న్ పార్ట్ కీ చాలా ప్రాధాన్యం ఉంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రేమ ఎంతో? యాక్ష‌న్ ఎంతో? తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS