తాత పెద్ద ఎన్టీఆర్ పాత్రకు న్యాయం చేయడానికి ఎన్టీఆర్‌కి అన్ని అర్హతలూ ఉన్నాయి. కానీ, ఎందుకో ఆ పాత్రను టచ్ చేయడానికి ఎన్టీఆర్ ఆసక్తి చూపడం లేదు. ఆయన మహానుభావుడు. ఆయన్ని మ్యాచ్ చేయడం నా తరం కాదు.. అని అందుకు బలమైన రీజన్ కూడా చెప్పేసి ఆ పాత్ర పోషించే అవకాశమొస్తే, సున్నితంగా తిరస్కరిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాజాగా ఈ చర్చ ఇప్పుడెందుకు వచ్చిందంటే, మొన్నామధ్య 'మహానటి' టైమ్‌లో ఎన్టీఆర్ ముందు ఈ ప్రపోజల్ వచ్చింది. అప్పుడు తిరస్కరించాడు. మళ్లీ ఇప్పుడు అదే ఆఫర్ ఎన్టీఆర్ ముందుకు వచ్చింది. ఈ సారి బాలీవుడ్ క్వీన్ కంగనా సరసన నటించే ఛాన్స్ వదిలుకున్నాడు ఎన్టీఆర్.
కంగనా ప్రధాన పాత్రలో 'తలైవి' మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, ఒకప్పటి హీరోయిన్ జీవిత గాధగా తెరకెక్కుతోన్న చిత్రం 'తలైవి'. జయలలిత బయోపిక్ అంటే, అందులో ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుంది. ఆ పాత్ర కోసమే, జూనియర్ ఎన్టీఆర్‌ని సంప్రదించారట చిత్ర యూనిట్. ఎన్టీఆర్ - జయలలిత కాంబినేషన్‌లో కొన్ని సీన్స్ చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ అనుమతి అడగ్గా, అందుకు ఎన్టీఆర్ అంగీకరించలేదని తెలుస్తోంది. అంతే కదా.. మన తెలుగు సినిమాలో నటించేందుకే ఒప్పుకోలేని ఎన్టీఆర్, ఇప్పుడు పరభాష కోసం ఒప్పుకుంటే ఏమంత బాగోదు కదా. ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.