కొర‌టాల లైన్‌లోకి వ‌చ్చాడా?

By Gowthami - April 07, 2021 - 10:49 AM IST

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో ఓ సినిమా ప‌ట్టాలెక్కాల్సివుంది. అన్నీ రెడీనే. కానీ స‌డ‌న్ గా ఈ ప్రాజెక్టు వెన‌క్కి వెళ్లిపోయింది. ఈ స్థానంలో ఎన్టీఆర్ ముందు రెండు ఆప్ష‌న్లు ఉన్నాయి. ఒక‌టి... బుచ్చిబాబు, రెండోది కొర‌టాల శివ‌.

 

ఉప్పెన చూసి ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్‌.. బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తాన‌ని క‌మిట్ అయిపోయాడు. బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్ కోసం ఓ క‌థ రెడీ చేసేసుకున్నాడు. అన్నీ కుదిరితే, త్రివిక్ర‌మ్ ప్లేస్ లో ఈ సినిమానే మొద‌ల‌వ్వాలి. అయితే.. ఇప్పుడు కొర‌టాల శివ కూడా ట‌చ్‌లోకి వ‌చ్చాడ‌ని టాక్‌. ప్ర‌స్తుతం `ఆచార్య‌`తో బిజీగా ఉన్నాడు కొర‌టాల‌. మే 13న విడుద‌ల అవుతుంది. ఆ త‌ర‌వాత‌... బ‌న్నీతో ఓ సినిమా చేయాలి. బ‌న్నీకంటే ముందు ఎన్టీఆర్ తో ప్రాజెక్టు అవ్వ‌గొట్టే ఛాన్స్ ఉందా, లేదా? అనే విష‌యంపై కొర‌టాల త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్న‌ట్టు టాక్. ఒక‌వేళ‌... కావ‌ల్సినంత టైమ్ ఉంద‌ని అనుకుంటే మాత్రం.. ఎన్టీఆర్ - కొర‌టాల సినిమా ఖాయం అవ్వొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS