'ఆర్.ఆర్.ఆర్'కి సంబంధించి రామ్ చరణ్ లుక్, టీజర్ ఎప్పుడో వచ్చేశాయి. రాజమౌళి విజన్‌కి, ఆ టీజర్‌కి మెగా ఫ్యాన్స్ హ్యాట్సాఫ్ చెప్పేశారు. ఇక మిగిలింది ఎన్టీఆర్ టీజరే. ఎన్టీఆర్ పుట్టిన రోజున టీజర్ వస్తుందని భావించారంతా. కానీ... అది జరగలేదు. కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయింది. అప్పటి నుంచీ ఎన్టీఆర్ టీజర్ పెండింగ్ లోనే ఉండిపోయింది. త్వరలోనే.. ఎన్టీఆర్ లుక్ , టీజర్ వస్తుందని ఆశ పడుతున్న ఎన్టీఆర్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ టీజర్ కి సంబంధించిన షూట్ ఇంకా చేయలేదని తేల్చేశాడు. ''ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ మొదలెట్టిన వెంటనే.. ఎన్టీఆర్ టీజర్‌కి సంబంధించిన షాట్స్ ని షూట్ చేస్తాం. దానికి 15 రోజులు పడుతుంది. కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ ఎప్పుడన్నది చెప్పలేం. ఎన్టీఆర్, చరణ్ లు నా మాట కోసం ఎదురు చూస్తున్నారు..'' అన్నాడు రాజమౌళి. `ఆర్.ఆర్.ఆర్` ఎప్పుడు మొదలవుతుందో, ఎన్టీఆర్ టీజర్ ఎప్పుడు బయటకు వస్తుందో...?