రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి త్వరలో ఓ సూపర్ సెన్సేషనల్ గిఫ్ట్ రాబోతోంది. అది కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుక. మే 20న యంగ్ టైగర్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే ఆ బహుమతి తయారీ పనులు ప్రారంభమయ్యాయట. ఇటీవల మెగా పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా, యంగ్ టైగర్ ‘మెగా గిఫ్ట్’ విడుదల చేసిన విషయం విదితమే. అదే, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రడక్షన్.
‘నా అన్న అల్లూరి సీతారామరాజు’ అంటూ చరణ్ పాత్ర గురించి యంగ్ టైగర్ ఇచ్చిన వాయిస్ ఓవర్, సినిమాలో చరణ్ పాత్రని ఓ రేంజ్‌లో ఎలివేట్ చేసేసింది. ఇక, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ సిద్ధమవుతోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ గిఫ్ట్ నిడివి కాస్త ఎక్కువే వుంటుందట. యంగ్ టైగర్ గెటప్ ఈ ప్రోమోకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందనుకోండి.. అది వేరే విషయం. చరణ్ వాయిస్ ఓవర్ ఇస్తాడా? లేదంటే, ఇంకేదన్నా కొత్తగా రాజమౌళి ప్లాన్ చేశాడా.? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ‘నీరు - నిప్పు’ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఫస్ట్ ప్రోమో అదిరిపోయింది. అంతకు మించి.. వెయ్యి రెట్లు ఇంపాక్ట్ చూపించింది సీతారామరాజు ఇంట్రో. మరిప్పుడు, యంగ్ టైగర్ ఇంట్రో.. ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.