నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత దారుణమైన పరాజయం 'పరమవీర చక్ర'తో ఎదురైంది. ఈ సినిమాకి అత్యల్ప ఓపెనింగ్స్ లభించాయి. బాలయ్య కెరీర్లో ఇప్పటికీ అదే చెత్త రికార్డు. ఇప్పుడు దాన్ని `మహానాయకుడు` అధిగమించింది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ తొలి రోజు వసూళ్ల పరంగా చెత్త రికార్డు సృష్టించింది.
తొలి రోజు ఈ సినిమాకి రెండు రాష్ట్రాలలోనూ కలిపి 1.6 కోట్ల షేర్ వచ్చింది. ఈమధ్య కాలంలో ఓ స్టార్ హీరో సినిమాకి ఇంత తక్కువ ఓపెనింగ్స్ రావడం ఇదే తొలిసారి. గుంటూరులో 51 లక్షలు తెచ్చుకున్న ఈ చిత్రం.. మిగిలిన ఏ ఏరియాలోనూ 30 లక్షలు కూడా సాధించలేదు. ఒక్క నైజాంలోనే 36 లక్షలు వసూలు చేసింది.
ఈస్ట్, వెస్ట్ లో మరీ దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. నెల్లూరులో అత్యల్పంగా 6 లక్షలు తెచ్చుకుంది. తొలి భాగం డిజాస్టర్ అవ్వడంతో బాలయ్య పంపిణీదారులకు పెద్ద ఆఫర్ ఇచ్చాడు. మహానాయకుడు వసూళ్లలో 40 శాతం వాళ్లకే అంటూ తీర్మాణించాడు. మహానాయకుడు హిట్టయితే కథానాయకుడు నష్టాన్ని పూడ్చుకోవచ్చు అని ఎదురుచూసిన పంపిణీదారులకు నిరాశే ఎదురైంది.