రెమ్యునరేషన్ లో టాప్ టెన్ హీరోయిన్స్

మరిన్ని వార్తలు

IMDb నేతృత్వంలో ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లిస్ట్ రిలీజ్  చేసింది ఫోర్బ్స్. ఈ లిస్ట్ లో దీపికా పదుకొనే మొదటి ప్లేస్ లో నిలిచింది. మిగతా వారు కూడా బాలివుడ్ హీరోయిన్సే ఉండటం గమనార్హం. సౌత్ నుంచి ఒక్క హీరోయిన్ కి కూడా చోటు దక్కలేదు. నయనతార, సమంత, రష్మిక, త్రిష లాంటి హీరోయిన్స్ కూడా ఈ మధ్య భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నయన తార ఒక్కో సినిమాకి 13 కోట్లు డిమాండ్ చేస్తోందని టాక్. త్రిష విశ్వంభర సినిమాకి 13 కోట్లు అందుకుంటోంది. రష్మిక కూడా పెరిగిన తన క్రేజ్ ని క్యాష్ చేసుకునే దిశగా రెమ్యునరేషన్ పెంచి సికిందర్ మూవీకి 13 కోట్లు డిమాండ్ చేసింది. సామ్ కూడా 10 కోట్లు దాటే తీసుకుంటోంది. అయినా మన హీరోయిన్స్ ఈ లిస్ట్ లో లేకపోవటం గమనార్హం. 


దీపికా ప్రస్తుతం 'కల్కి' సినిమాలో ప్రభాస్ తో కలిసి నటించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27 న రిలీజ్ కానున్న నేపథ్యంలో దీపికా పేరు మారుమ్రోగుతోంది. దీపికా ఒక్కో సినిమాకి 15 కోట్ల నుంచి 30 కోట్ల పారితోషికం తీసుకొంటోందని సమాచారం. దీనితో దీపీక టాప్ వన్ లో నిలిచింది. తరవాత బాలివుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. కంగనా ఒక్కో మూవీకి 15 నుంచి 27 కోట్లు తీసుకుంటోంది. థర్డ్ ప్లేస్ లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఉంది. చోప్రా ఒక్కో సినిమాకు 15 నుంచి 25 కోట్లు డిమాండ్ చేస్తోంది. కత్రినా కైఫ్ ఫోర్త్ ప్లేస్ లో ఉంది. ఈమె 15 నుంచి 25 కోట్ల వరకు వసూలు చేస్తుందని స‌మాచారం. 


ఐదో ప్లేస్ లో ఆలియా భట్ నిలిచింది. ఆలియా ఒక్కో సినిమాకి 10 నుంచి 20 కోట్లు అందుకుంటోంది. తరువాత స్థానాల్లో క‌రీనా ఒక సినిమాకి 18 కోట్ల వరకు వసూలు చేస్తోందని, శ్రద్ధా కపూర్ సుమారు 15 కోట్లు తీసుకొంటోందని, విద్యాబాలన్ ఒక్కో సినిమాకు 14 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్టు తేలింది. 2024 లో ఏ సినిమాలు చేయకపోయినా  అనుష్క శర్మ, ఐశ్వర్యారాయ్ లు టాప్ 10 లో చోటు దక్కించుకోవటం విశేషం. అనుష్క శ‌ర్మ 12 కోట్లు, ఐశ్వ‌ర్యారాయ్ 10 కోట్లు అందుకుంటున్నారని  ఐఎండిబి-ఫోర్బ్స్ స‌ర్వే పేర్కొంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS