జూమ్ లో కథ చెప్పేసిన ప్రశాంత్ నీల్

By iQlikMovies - August 12, 2020 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఎన్టీఆర్ 'RRR' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో #ఎన్టీఆర్30 చిత్రంలో నటిస్తారు. ఈ సినిమా తర్వాత 'కెజిఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని చాలా రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది.

తాజాగా ఈ ప్రాజెక్టు గురించి మరో ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఈమధ్య ప్రశాంత్ నీల్ జూమ్ యాప్ ద్వారా దాదాపు గంట పాటు ఎన్టీఆర్ తో చర్చలు జరిపారట. ఈ సందర్భంగా తను రెడీ చేసిన స్టోరీ లైన్ కూడా ఎన్టీఆర్ కు వినిపించారని సమాచారం. ఎన్టీఆర్ కు స్టోరీ లైన్ నచ్చడంతో దాన్ని పూర్తిస్థాయిలో డెవలప్ చేయమని దర్శకుడిని కోరారట.

ప్రశాంత్ ప్రస్తుతం 'కెజిఎఫ్: చాప్టర్ 2' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత పూర్తిస్థాయిలో ఎన్టీఆర్ ప్రాజెక్టుపై వర్క్ చేస్తారని సమాచారం అందుతోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS