ఈ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కొత్త సినిమాల జాతర మొదలైంది. గురువారమే.. కొరటాల శివ సినిమాకి సంబంధించిన ఓ బుల్లి టీజర్ వచ్చింది. అందులో ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా విశేషాలు కూడా బయటకు రాబోతున్నాయి.
కేజీఎఫ్, కేజీఎఫ్ 2లతో అదరగొట్టిన ప్రశాంత్ నీల్ .. త్వరలోనే ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్.. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలకు రాబోతోంది. ప్రస్తుతం ప్రభాస్ తో `సలార్` చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. అది పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. మరో వైపు... బుచ్చిబాబు కథకీ ఎన్టీఆర్ ఓకే చెప్పాడు. ఆ సినిమా అప్ డేట్ ఎప్పుడు వస్తుందో మరి.