మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ఈ యేడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్టు సమాచారం. మహేష్ తో చేయబోయే సినిమా మల్టీస్టారర్ అని ఇది వరకు ప్రచారం జరిగింది. దానిపై రాజమౌళి ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశాడు. ఇది మల్టీస్టారర్ సినిమా కాదని, సోలో హీరో సినిమానే అని తేల్చేశాడు.
కాకపోతే... మహేష్ తో ఢీ కొట్టే విలన్ స్థానంలో మాత్రం ఓ హీరో ఉంటాడని టాక్. రాజమౌళి సినిమాలో ప్రతినాయకుల పాత్రలన్నీ బలంగా ఉంటాయి. ఓ రకంగా చెప్పాలంటే విలనిజమే ఆయువు పట్టు. అందుకే మహేష్ సినిమా విషయంలో బలమైన విలన్ ఉంటాడని చెప్పక తప్పదు. ఆ పాత్ర కోసం ఇప్పుడే అన్వేషణ మొదలైపోయింది. దేశమంతా ఉన్న హీరోలలో ఎవరిని విలన్ గా చేద్దామనే విషయంపై తర్జన భర్జనలు పడుతున్నారు. ఓ లీడింగ్ హీరోనే మహేష్ కోసం విలన్ అవుతాడనని సమాచారం అందుతోంది. ఉదాహరణకు సూర్య, కార్తి, విక్రమ్... ఇలాంటి పేర్లు రాజమౌళి పరిశీలిస్తున్నాడని. ఓ పెద్ద స్టారే విలన్ గా దర్శనమిస్తాడని తెలుస్తోంది. మరి ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో?