కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. మళ్లీ... థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో? సినిమాలు ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి. ఈ దెబ్బకి రిలీజ్ డేట్లన్నీ గల్లంతైపోయాయి. అన్ని సినిమాలూ కొత్త రిలీజ్ డేట్‌లను పట్టుకోవాల్సిందే. ఆర్.ఆర్.ఆర్. అక్టోబరు 13న వస్తుందని చిత్రబృందం ముందే ప్రకటించింది. ఆ డేట్ కి ఈ సినిమా రావడం దాదాపు అసాధ్యం. కచ్చితంగా సినిమా విడుదల వాయిదా పడే ఛాన్సుంది. అయితే.. ఇప్పుడొచ్చిన కొత్త `ఆర్.ఆర్.ఆర్` పోస్టర్ మాత్రం.. పాత రిలీజ్ డేట్ నే ఫాలో అయ్యింది.
అక్టోబరు 13న విడుదల చేస్తామని చిత్రబృందం మరోసారి ప్రకటించడంతో... ఫ్యాన్స్ తో పాటు మిగిలిన సినిమాల వాళ్లూ షాక్ లో పడ్డారు. ఈరోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కొమరం భీమ్ పోస్టర్ ని విడుదల చేశారు. జాగ్రత్తగా గమనిస్తే. పోస్టర్ కింద రిలీజ్ డేట్ ఉంది. అది.. అక్టోబరు 13. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఆ కోవలోనే ఆర్.ఆర్.ఆర్ కూడా వెళ్లిపోతుందనుకున్నారు. 2021లో ఆర్.ఆర్.ఆర్ విడుదల అవ్వడం అసాధ్యం అన్నది ట్రేడ్ వర్గాల మాట. అయినా సరే.. రాజమౌళి అండ్ కో.. పాత రిలీజ్ డేట్ తోనే పోస్టర్ విడుదల చేసింది. మరి అంత కాన్ఫిడెన్స్ ఏమిటో?