వకీల్ సాబ్ తో ఆకట్టుకున్నాడు వేణు శ్రీరామ్. మూడేళ్ల తరవాత... పవన్ కల్యాణ్ తెరపై కనిపించిన సినిమా ఇది. పవన్ ని అభిమానులకు నచ్చేలా చూపించి సక్సెస్ అయ్యాడు. వకీల్ సాబ్ తరవాత.. మళ్లీ పవన్ తో వేణు శ్రీరామ్ ఓ సినిమా చేస్తాడని, అది `వకీల్ సాబ్`కి సీక్వెల్ లా ఉండొచ్చని ప్రచారం సాగింది. అయితే అదంతా ఒట్టిదే అని తేలిపోయింది. వకీల్ సాబ్... సక్సెస్ మూడ్ లోంచి బయటకు వచ్చిన వేణు శ్రీరామ్... ఇప్పుడు మరో కథ తయారు చేసేసుకున్నాడు. హీరోకూడా దాదాపుగా ఫిక్స్. ఆ హీరో... సాయిధరమ్ తేజ్ అని సమాచారం.
సాయిధరమ్ కోసం వేణు ఓ కథ సిద్ధం చేశాడని తెలుస్తోంది. ఈ లైన్ తేజూకి కూడా వినిపించాడని, తేజూ ఈ కథ వినగానే ఎగ్జైట్ అయ్యాడని సమాచారం. `రిపబ్లిక్` ముగిసిన వెంటనే, ఈ సినిమాని పట్టాలెక్కించడానికి తేజూ కూడా ఉత్సాహంగా ఉన్నాడట. అయితే వేణు దగ్గర `ఐకాన్` అనే మరో కథ ఉంది. ఇది అల్లు అర్జున్ తో చేద్దామనుకున్నారు. `వకీల్ సాబ్` హిట్ తరవాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అనుకున్నారు. కానీ.. కుదర్లేదు. మరి ఐకాన్ సినిమాకి ఎప్పుడు మోక్షం దొరుకుతుందో చూడాలి.