ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో తెరకెక్కిన 'జై లవకుశ' ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. అంచనాల ప్రకారమే ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఈ రోజు గురువారం తొలి రోజు ఈ రోజు పరిస్థితి ఇలా ఉంది. ఇక నెక్స్ట్ రేపటి నుండి వరుసగా హాలీడేస్. సో ఎన్టీఆర్ దున్నుడే దున్నుడిక. ఈ హాలీడేస్‌కి అడ్వాన్స్ బుకింగ్స్ ముందుగానే కంప్లీట్ అయిపోయాయి. సో ఈ మూడు రోజులు ధియేటర్స్ అన్నీ హౌస్‌ఫుల్సే. అలాగే ఓవర్సీస్‌లోనూ ముందస్తు బుకింగ్స్‌తో అక్కడ కూడా అంచనాలు బాగున్నాయి. మంచి వసూళ్లు రాబట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్‌లో సందడి చేస్తున్నారు. మూడు గెటప్పులో ఎన్టీఆర్‌ని చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు ఫ్యాన్స్‌కి. ఎక్కువగా 'జై' నామస్మరణ వినిపిస్తోంది. లవ, కుశ సైడ్ అయిపోయినప్పటికీ, జై గెటప్‌లో ఎన్టీఆర్ మొత్తం మూడు గెటప్పుల్నీ తలదన్నేలా పర్‌ఫామెన్స్ ఇచ్చేశాడు. ఎన్టీఆర్ నటన పరంగా అద్భుతం, అమోఘం అనే మాటలే ఎక్కడ విన్నా. ఆ రేంజ్‌లో నెగిటివ్ టచ్‌తో ఎన్టీఆర్ దుమ్ము దులిపేస్తున్నాడు. కొత్తదనంతో సరికొత్తగా ఆకట్టుకుంటున్నాడు జై పాత్ర ద్వారా ఎన్టీఆర్. ఈ సినిమాకి బుల్లితెర గేమ్ షో 'బిగ్‌బాస్' ప్లస్ అయ్యిందనే చెప్పొచ్చు ఎన్టీఆర్‌కి. తనలోని నటనా పాఠవాలకి మరింత మెరుగులు దిద్దుకునే అవకాశం కల్గింది. ఇదే టాక్ కంటిన్యూ అయితే ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ వసూళ్లు సాధించే సినిమా 'జై లవకుశ' అవుతుందనడం నిస్సందేహం.