ఎన్టీఆర్‌ కండలు కరిగించింది అందుకేనట.!

By iQlikMovies - May 05, 2018 - 15:05 PM IST

మరిన్ని వార్తలు

త్రివిక్రమ్‌ - ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో సినిమా ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న సంగతి తెలిసిందే. స్టార్టింగ్‌కి ఎక్కువ టైమ్‌ తీసుకున్నా, పట్టాలెక్కినాక సినిమా వేగంగా షూటింగ్‌ పూర్తి చేసుకుంటోంది. ప్రస్తుతం ఓ యాక్షన్‌ సీన్‌ని షూట్‌ చేస్తున్నారు. ఈ యాక్షన్‌ సీన్‌ సినిమాకే హైలైట్‌ కానుందట. ముఖ్యంగా ఈ సీన్‌ కోసమే ఇన్నాళ్లుగా ఎన్టీఆర్‌ కండలు కరిగించే పని పెట్టుకున్నాడంటే, ఈ సీన్‌ సినిమాకి ఎంత ఇంపార్టెంటో అర్ధం చేసుకోవచ్చు. 

ఈ ఫైట్‌ సీన్‌లో ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌తో కనిపించనున్నాడట. 'టెంపర్‌'లో ఓ సాంగ్‌ కోసం తొలిసారిగా సిక్స్‌ ప్యాక్‌ ట్రై చేశాడు ఎన్టీఆర్‌. కాజల్‌ అందాలు, ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌ ఆ సాంగ్‌కి హైలైట్‌ అయ్యాయి. తర్వాత ఇప్పుడు ఇదిగో ఈ సినిమాలోని ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసం మరోసారి షర్టు విప్పేయనున్నాడట ఎన్టీఆర్‌. యాక్షన్‌ సీన్స్‌ని తెరకెక్కించడంలో త్రివిక్రమ్‌ స్టైలే వేరు. యాక్షన్‌తో పాటు కూసింత స్టైల్‌ కూడా మిక్స్‌ చేస్తాడు. ఇక సిక్స్‌ ప్యాక్‌ హీరో అయితే ఆ సీన్‌ ఇంకెంతగా ఎలివేట్‌ అవుతుందో కదా. అందుకే మరి ఎన్టీఆర్‌ అంత కష్టపడి స్పెషల్‌ ట్రైనర్‌ని పెట్టుకుని మరీ కండలు కరిగించింది. 

ఇకపోతే ఈ సినిమా కథేంటని పూర్తిగా తెలీదు కానీ, ఎన్టీఆర్‌ సాప్ట్‌వేర్‌ ఉద్యోగి పాత్రలో కనిపించనున్నాడు. ముద్దుగుమ్మ పూజా హెగ్దే ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో తొలిసారిగా జత కడుతోంది. 'అజ్ఞాతవాసి' సినిమాని రూపొందించిన హారికా హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌లోనే ఈ సినిమా కూడా రూపొందుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS