పవన్-రవితేజల ఊహించని కలయిక

By iQlikMovies - May 05, 2018 - 14:07 PM IST

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రవితేజ కలయికని ఇంకోన్ని రోజుల్లో మనం చూడబోతున్నాము. అయితే ఇదేదో సినిమా కోసం కాదు...

పూర్తి వివరాల్లోకి వెళితే, మాస్ మహారాజ్ రవితేజ తాజా చిత్రం నేల టిక్కెట్టు ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 10న విడుదలకానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పవన్ కళ్యాణ్ రానున్నట్టుగా నేల టిక్కెట్టు చిత్ర నిర్మాత అధికారికంగా ప్రకటించాడు.

అయితే రవితేజ-పవన్ లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఏ ఒక్క ఈవెంట్ లో కలిసి కనిపించలేదు. దీనితో ఈ ఈవెంట్ కి చాలా ప్రాధాన్యత ఏర్పడింది, ఇరు హీరోల అభిమానులు కూడా ఈ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక రవితేజ తో పాటుగా ఈ సినిమాలో హీరోయిన్ మాళవిక శర్మ నటిస్తున్నది. ఈ చిత్రానికి శక్తికాంత్ స్వరాలు సమకూర్చారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS