బాలీవుడ్ ఇండస్ట్రీ గత కొంత కాలంగా నష్టాల్లో ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు, సూపర్ స్టార్స్, మల్టీ స్టారర్ సినిమాలకి కూడా ఫస్ట్ డే కలక్షన్స్ రావటం లేదు. బాలీవుడ్ హిట్ మొహం చూసి చాలా రోజులయ్యింది. దాదాపు 'యానిమల్' తరువాత స్త్రీ 2 వరకు బాలీవుడ్ లో హిట్ లేదు. మళ్ళీ ఇన్నాళ్లకి 'చావా' ద్వారా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. చావా బాలీవుడ్ మార్కెట్ కి ఊపిరి పోసింది. వరుస డిజాస్టర్లతో కాన్ఫిడెన్స్ పోగొట్టుకున్న బాలీవుడ్ మేకర్స్ చావాని కేవలం హిందీ భాషలోనే రిలీజ్ చేసారు. ఇప్పడు వస్తున్న రెస్పాన్స్ చూసి పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసే ఆలోచనలో పడ్డారు.
ఈ క్రమంలోనే ఒక్కో భాషలో రిలీజ్ చేసేందుకు ఆయా భాషల్లో డబ్బింగ్ చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. చావా తెలుగు వెర్షన్ డబ్బింగ్ కి క్రేజ్ అప్డేట్ వచ్చింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చావా కోసం గొంతు అరువు ఇవ్వనున్నారని తెలుస్తోంది. మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉన్న ఎన్టీఆర్ తన డైలాగ్ డెలివరీ తో చావాకి అదనపు ఆకర్షణ అవుతారని మేకర్స్ భావిస్తున్నారట. ఎన్టీఆర్ వాయిస్ కి, డైలాగ్ డెలివరీ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది.
ఛావా నార్త్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. అలాగే తెలుగు ఆడియన్స్ కి కూడా నచ్చాలంటే ఎదో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉండాలని భావిస్తున్నారట. ఎన్టీఆర్ ఫాన్స్ తో పాటు మిగతా తెలుగు వారు కూడా ఎన్టీఆర్ కోసం ధియేటర్ కి వస్తారని, ఎన్టీఆర్ పేరుతో ప్రమోషన్స్ కూడా నిర్వహించవచ్చని మేకర్స్ ప్లాన్. నిజంగా ఎన్టీఆర్ చావా కి డబ్బింగ్ చెప్తే నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి.