NTR: ఎన్టీఆర్‌ సినిమా... అంచనా తప్పింది

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్, ప్రశాంత్‌ నీల్‌ కలయికలో ఓ చిత్రం తెరకెక్కించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. #ఎన్టీఆర్ 31 వర్కింగ్‌ టైటిల్‌ తో వచ్చిన ఎనౌన్స్ మెంట్ అభిమానుల్లో అంచనాలు భారీగా పెంచింది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అప్‌డేట్‌ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఒకసారి ప్రశాంత్‌ నీల్‌.. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే ప్రశ్నకు 2023 ఏప్రిల్‌ మొదలవుతుందని చెప్పారు. అయితే తాజాగా ఎన్టీఆర్ మాటలు చూస్తుంటే.. ప్రశాంత్ నీల్ అంచనా తప్పిందనే చెప్పాలి.

 

అమిగోస్ ప్రీరిలీజ్ వేడుకలో తను కొరటాల శివతో చేయబోతున్న సినిమా అప్డేట్ ఇచ్చారు ఎన్టీఆర్. మార్చిలో షూటింగ్ స్టార్ట్ చేస్తామని 2024 ఏప్రిల్ లో విడుదల వుంటుంది చెప్పారు. దీంతో ప్రశాంత్ నీల్ షూటింగ్ వెనక్కి జరిగింది. మొదట అనుకున్న దాని ప్రకారం కొరటాల సినిమా ఇప్పటికే మొదలైవుండాలి. కానీ బాగా ఆలస్యం జరిగింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ లది పాన్ ఇండియా సినిమా. చాలా ప్రిపరేషన్ కావాలి. రెండు సినిమాలని ఒకేసారి షూట్ చేసే అవకాశం అవకాశం లేదు. బహుసా ఏడాది చివర్లో ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం వుంది.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS