నూతన్ నాయుడు రీ-ఎంట్రీ ఫిక్స్ అయినట్టేనా?

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ హౌస్ లో సంచలనాలకి కొదవే లేదు. ఇక ఈ వారానికి వస్తే, ఇప్పటివరకు బిగ్ బాస్ ఇంటి నుండి బయటకి వెళ్ళిపోయిన ఆరుగురిలో ఒకరు మళ్ళి తిరిగి ఇంటికి రానున్నారు.

అయితే ఈ విషయం ఇంటిలోని సభ్యులకి తెలియకపోవడంతో వారంతా ఈ వారం తమ మధ్యలోని ఎవరో ఒకరు వెళ్ళిపోతున్నారు అన్న భావనలోనే ఉన్నారు. ఇక ఈ వారం ఇంటిలోకి తిరిగి వెళ్ళేందుకు ప్రజల నుండి ఓటింగ్ ద్వారా ఎంపిక చేసే ప్రక్రియని చేపట్టారు.

దీనితో ఇంటిలోకి ఈరోజు కాని రేపు కాని ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ఈ రీ-ఎంట్రీ ఆప్షన్ ద్వారా ఇంటిలోకి వెళ్లనున్నారు అన్న దాని పైన క్లారిటీ రానుంది. అయితే ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం నూతన్ నాయుడు ఇంటిలోకి పునః ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టుగా ఉంది.

ఇక నూతన్ నాయుడు కాకుండా శ్యామల పేరు కూడా చాలా బలంగా వినిపిస్తుంది. ఇంకొన్ని గంటల్లో దీని పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS