సూర్య హీరోగా తెరకెక్కుతోన్న 'ఎన్‌జీకే' మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో రకుల్‌తో పాటు, సాయి పల్లవి కూడా మరో హీరోయిన్‌గా నటిస్తోంది. లేటెస్ట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌లో రకుల్ ఓ ఆఫీసర్ పాత్రలో కనిపించింది.
సాయి పల్లవి మాత్రం సూర్యకు భార్యగా కనిపించింది. అంటే రకుల్‌కి ఈ సినిమాలో పెద్దగా సీను లేదా.? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాయి పల్లవితో పోల్చితే రకుల్ పాత్రకు నిడివి కూడా తక్కువేనని సమాచారమ్. అంతేకాదు, సూర్యతో రకుల్‌కి పెద్దగా కెమిస్ట్రీ కూడా ఉండదట. గ్లామర్‌కి పెద్దగా స్కోపున్న క్యారెక్టర్ కాదు కానీ, పర్‌ఫామెన్స్ పరంగా రకుల్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుందని కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఏదిఏమైనా ఈ సినిమాలో రకుల్ మెయిన్ హీరోయిన్ కాదని ఆమె ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. మరో వైపు రకుల్ - కార్తి జంటగా తెరకెక్కిన 'దేవ్' మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో రకుల్ సోలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రోమోస్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఈ సినిమాపై రకుల్ భారీగా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాకి మంచి విజయం దక్కితే రకుల్ మళ్లీ తెలుగులో తన ఉనికిని చాటుకునే అవకాశం ఉంటుంది. చూడాలి మరి. రకుల్ పరిస్థితి ఏంటో.!