సమంత నటించిన 'ఓ బేబీ' చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. మంచి టాక్‌తో పాటు, బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించింది 'ఓ బేబీ'. సమంత కెరీర్లోనే బిగ్గెస్ట్ ఎచీవ్‌మెంట్‌గా నిలిచింది 'ఓ బేబీ'. తాజాగా 'ఓ బేబీ' ఓవర్సీస్లోనూ రికార్డు సృష్టించింది. వన్ మిలియన్ డాలర్స్‌ని రీచ్ అయ్యింది. ఇది చాలా రేర్ ఫీట్. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఓవర్సీస్లో ఈ స్థాయి వసూళ్లను కొల్లగొట్టడం నిజంగా రికార్డే.
ఆ రికార్డు సమంత సొంతమైంది. అంటే ఓవర్సీస్లో సమంత ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఫాలోయింగ్ ఉన్నా, అన్ని సినిమాలూ ఈ స్థాయిలో రికార్డులు సృష్టిస్తాయని చెప్పలేం. కానీ, కంటెంట్ పరంగా 'ఓ బేబీ' అన్ని వర్గాల వారినీ ఎంటర్టైన్ చేసేలా ఉండడంతో, ఇటీవలి కాలంలో ఈ తరహా డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ స్టోరీస్ రాకపోవడంతో, 'ఓ బేబీ'కి కలిసొచ్చింది.
మంచి హిట్ కట్టబెట్టారు అక్కడి ఎన్నారైలు. ఈ ఫీట్‌తో సమంతను అంతా సూపర్‌స్టార్ అని పిలిచేసుకుంటున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఓ బేబీ'లో నాగశౌర్య కీలక పాత్ర పోషించాడు. సీనియర్ నటి లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, తేజ ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే.