ఒక భారీ సినిమా అంటే టెక్నీకల్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. పక్కాగా ఉంటుంది. కానీ 'సాహో' విషయంలో మాత్రం గందరగోళం నెలకొంది. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఈ సినిమా నుండి సంగీత త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ తప్పుకున్నాక మ్యూజిక్ బాధ్యతలు జిబ్రాన్ కి అప్పగించారని వార్తలు వచ్చాయి. సాహో ట్రైలర్ లో గిబ్రాన్ పేరు కనిపించింది.
ఐతే ఇక్కడే ఓ మెలిక వుంది. కేవలం నేపధ్య సంగీతం మాత్రమే గిబ్రాన్ కి ఇచ్చారు. ఇప్పుడు సాహో కొత్త పోస్టర్ లో ఆ సంగతి తెలిసింది. అన్నిపేర్లు వున్నాయి కానీ సంగీత దర్శకుడి పోస్ట్ ఖాళీగా పెట్టారు. దింతో ఈ సినిమాకి మ్యూజిక్ విషయంలో ఇంకా ఎవరినీ ఫిక్స్ చేయలేదని తేలిపోయింది.
ఇటీవల విడుదలైన 'సయ్యాన్ సైకో' పాటని బాలీవుడ్ సంగీత దర్శకుడు తనిష్క్ బాఘ్చి తో చేయించుకున్నారు. అందులో క్రెడిట్ కూడా ఇచ్చారు. ఇక ఈ సినిమాలో మిగిలిన పాటల వ్యవహారం కూడా ఇలానే ఉండబోతుందని టాక్. ఒకొక్కరితో ఒక్కో పాట చేయించుకొని ఏ పాట క్రెడిట్ ఆ పాటకు ఇచ్చేయాలనే నిర్ణయానికి వచ్చేశారట సాహో నిర్మాతలు. సో.. సాహోకి సింగల్ కార్డు మ్యూజిక్ లేనట్లే.