'ఓబేబీ' నిర్మాత‌ల మ‌రో కొరియ‌న్ రీమేక్‌!

మరిన్ని వార్తలు

సమంత నటించిన ఓ బేబీ చిత్రం సంచలన విజయం సాధించి సమంత ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా అలరించిన ఓ బేబీ 'మిస్ గ్రానీ' అనే కొరియన్ చిత్రానికి రీమేక్. నిర్మాత డి సురేష్ బాబు మరియు సునీత కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు మల్లి అదే నిర్మాతలు మరో కొరియన్ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారు.

 

నిర్మాత సురేష్ బాబు 'మిడ్ నైట్ రన్నర్స్' అనే ఓ కొరియన్ కామెడీ థ్రిల్లర్ ను తెలుగు లో రీమేక్ చేయబోతున్నట్టు సమాచారం. నివేత థామస్, రెజినా ఈ చిత్రం లో పోలీస్ ఆఫీసర్స్ పాత్రల్లో కనిపించనున్నారు. కిడ్నాప్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే ఈ చిత్రానికి 'స్వామి రారా' ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర బృందం ప్రకటించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS