మామూలుగా ఉండదంటోన్న సమంత!

By iQlikMovies - May 22, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

అక్కినేని కోడలు సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఓ బేబీ'. 'ఎంత సక్కగున్నావే' అనేది క్యాప్షన్‌. తాజాగా ఈ సినిమా నుండి ఓ లుక్‌ రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో సమంత 'స్వాతి' పాత్ర పోషిస్తోంది. లేటెస్ట్‌గా రిలీజ్‌ చేసిన లుక్‌ విషయానికి వస్తే, మోడ్రన్‌ డ్రస్సులో సమంత స్టైల్‌గా నిలబడితే, బ్యాక్‌ గ్రౌండ్‌లో సీనియర్‌ నటి లక్ష్మీ ముఖం కనిపిస్తోంది. లక్ష్మీ ముఖాన్ని సమంతకు సైడ్‌ యాంగిల్‌లో చూపించి, కాన్సెప్ట్‌ బేస్‌లో ఈ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు.

 

పోస్టర్‌లో లిప్స్‌, స్పెక్టికల్స్‌, మైక్‌, బటర్‌ ఫ్లై.. తదితర వస్తువులు కనిపిస్తున్నాయి. 60 ఏళ్ల బామ్మ 16 ఏళ్ల మనవరాలిగా ఎలా మారిపోయింది.? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరాఠీ సినిమాకి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాని డేరింగ్‌ లేడీ డైరెక్టర్‌ నందినీ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా ఉండదు అంటూ సమంత తాజాగా సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌ని సమంత తెలుగులో పోస్ట్‌ చేయడం విశేషం. సినిమా అంతా ఫుల్‌ ఫన్‌తో డిజైన్‌ చేశారట.

 

ఇదిలా ఉంటే, ఈ మధ్య సమంతకు ఎదురే లేదు. సమంత చెయ్యి పడితే ఆ సినిమా సూపర్‌ హిట్‌ అనేంతలా ఆమె లక్‌ పని చేస్తోంది. అందుకు ఇటీవల విడుదలైన 'మజిలీ'నే పెద్ద నిదర్శనం. గత రెండేళ్లుగా సమంతకు పట్టిందల్లా బంగారమే అవుతోంది. 'ఓ బేబీ'తో సమంత మరో సంచలనానికి రెడీ అయిపోయినట్లే అని చెప్పక తప్పదనిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS